నాన్న చనిపోయినప్పుడు ఇంటికి వచ్చి అరుణ్ జైట్లీ ధైర్యం చెప్పారు: కోహ్లీ

ఢిల్లీ: మా నాన్న ప్రేమ్ కోహ్లీ చనిపోయినప్పుడు దివంగత బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఇంటికి వచ్చి ధైర్యం చెప్పారు అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి జైట్లీ పేరు పెట్టారు. అలాగే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు కోహ్లీ పెవిలియన్ అని పేరు పెట్టారు. ఈ రెండు కార్యక్రమాలు గురువారం నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్‌లో జరిగాయి.

జైట్లీతో ప్రత్యేక అనుబంధం:
ఫిరోజ్‌షా కోట్లా మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టిన సందర్భంగా గురువారం కోహ్లీ ఆయనను గుర్తు చేసుకున్నారు. కోహ్లీ మాట్లాడుతూ... 'జైట్లీ నామకరణం, నా స్టాండ్ రెండు ఒకేసారి జరగడం ప్రత్యేకంగా ఉంది. తనకు, తన కుటుంబానికి ఎంతో గర్వంగా ఉంది. జైట్లీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్న చనిపోయినప్పుడు స్వయంగా ఇంటికి వచ్చి ధైర్యం చెప్పారు. ఆయన చాలా మంచి వ్యక్తి' అని కోహ్లీ తెలిపాడు.

కలలో కూడా అనుకోలేదు:
'ఇలాంటి అరుదైన గౌరవం నాకు లభిస్తుందని నేను ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. నా భార్య, కుటుంబ సభ్యుల ముందు ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్ధం కావడం లేదు' అని కోహ్లీ భావోద్వేగం చెందాడు. అనంతరం డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భారత జట్టుకు కోహ్లీ కృతజ్ఞతలు చెప్పాడు.

రంజీ మ్యాచ్ ఆడుతుండగా:
2006 డిసెంబర్‌లో కోహ్లీ ఢిల్లీ జట్టు తరఫున కర్ణాటకపై రంజీ మ్యాచ్ ఆడుతుండగా.. అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ తుది శ్వాస విడిచారు. 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును విరాట్ కోహ్లీ (90), పునిత్ బిష్త్‌తో కలిసి ఆదుకున్నాడు. ఈ జోడి ఆరో వికెట్కు 156 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను గెలిపించాడు.

నాన్న చివరి శ్వాసను చూశా:
'2006 డిసెంబర్‌లో కర్ణాటకతో ఢిల్లీ తరఫున నాలుగు రోజుల మ్యాచ్ ఆడుతున్నా. మూడో రోజు మేం బ్యాటింగ్ చేయాల్సి ఉండగా.. తెల్లవారుజామున నాన్నకి సీరియస్‌గా ఉండడంతో అందరం ఆందోళన చెందాం. ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. ఆయన చివరి శ్వాసను చూశా. నాకు ఏడుపు రాలేదు. అంతా బ్లాంక్‌గా అనిపించింది. కోచ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పా. మధ్యలో వదిలేయడం సరికాదని.. మ్యాచ్ ఆడి 90 పరుగులు చేశా. తిరిగి సాయంత్రం అంత్యక్రియలకు హాజరయ్యా' అని ఇటీవలే కోహ్లీ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications