న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి యాషెస్ టెస్టులో ఓటమి దిశగా ఇంగ్లాండ్

England vs Australia Ashes 2019, 1st Test Day 5 Live: Pat Cummins castles Jos Buttler 1st over after lunch

హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి యాషెస్ టెస్టులో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఓటమి దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 13/0తో ఆఖరి రోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ వరుసగా వికెట్లను కోల్పోతుంది. ప్రస్తుతం 42 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది.

ఆర్టికల్ 370 రద్దు: ధోనితో పోలుస్తూ MSD జోడీపై ప్రశంసల వర్షం!

ఇంగ్లాండ్ విజయానికి 278 పరుగులు అవసరం కాగా, ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే మరో మూడు వికెట్లు పడగొట్టాలి. క్రీజులో మెయిన్ అలీ(2), క్రిస్ వోక్స్(17) పరుగులతో ఉన్నారు. ఈరోజే ఆఖరి రోజు కావడం విశేషం. కాగా, స్టీవ్ స్మిత్ (142), మాథ్యూ వేడ్‌ (110) సెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

దీంతో ఆతిథ్య జట్టుకు 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అంతకముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసింది. కాగా, ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో స్టీవ్ స్మిత్ సెంచరీలు సాధించడంతో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

యాషెస్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన ఐదో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌గా స్మిత్ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో (219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసిన స్మిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో (142; 207 బంతుల్లో 14×4) సాధించాడు. దీంతో 2003లో మాథ్యూ హేడెన్‌ తర్వాత యాషెస్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

అరుదైన గౌరవం: వెటోరి జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన కివీస్ బోర్డు

గతంలో బార్డ్‌స్లే, మోరిస్, స్టీవ్‌ వాలు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశారు. తాజాగా స్మిత్ వీరి సరసన చేరాడు. టెస్టుల్లో స్మిత్‌ 25 సెంచరీలు సాధించాడు. యాషెస్‌లో మాత్రం ఇది పదో సెంచరీ. మరోవైపు వేగంగా 25 సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా స్టీవ్‌ (119 ఇన్నింగ్స్‌) నిలిచాడు. ఆసీస్ మాజీ దిగ్గజం బ్రాడ్‌మన్‌ (66 ఇన్నింగ్స్‌) ముందున్నాడు.భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 130 ఇన్నింగ్స్‌లలో 25 సెంచరీలు సాధించాడు.

Story first published: Monday, August 5, 2019, 19:13 [IST]
Other articles published on Aug 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X