Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన గౌరవం: వెటోరి జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన కివీస్ బోర్డు

New Zealand Cricket retires Daniel Vettori’s No. 11 ODI jersey

హైదరాబాద్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియెల్‌ వెటోరికి ఆ దేశ క్రికెట్ బోర్డు అరుదైన గౌరవాన్ని కల్పించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు డానియేల్ వెటోరి చేసిన సేవల గౌరవార్థం అతను ధరించిన జెర్సీ నంబర్‌ 11కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు రిటైర్మెంట్‌ ప్రకటించింది.

ఈ మేరకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డానియేల్ వెటోరి న్యూజిలాండ్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచాడు. దీంతో వెటోరి ధరించిన జెర్సీ నంబర్‌‌ను ఎవరికీ కేటాయించమని తెలిపింది.

"న్యూజిలాండ్ తరుపున రెండొందలు వన్డేలు ఒకే జెర్సీ నంబర్‌తో ఆడతారో ఆ జెర్సీ నంబర్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నాం. జెర్సీ నంబర్‌-11తో వెటోరి 291 వన్డేలు ఆడాడు. దాంతో ఆ జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాం" అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్‌లో పేర్కొంది.



2007 నుంచి 2011 మధ్య కాలంలో కివీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించిన డానియేల్ వెటోరి 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ తరుపున వెటోరి మొత్తం 112 టెస్టులాడాడు. 21 ఏళ్ల వయసులోనే టెస్టుల్లో తన 100వ వికెట్‌ను తీశాడు.

ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. మరోవైపు శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ల నేపథ్యంలో ఆటగాళ్ల నంబర్లను న్యూజిలాండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

Story first published: Monday, August 5, 2019, 16:42 [IST]
Other articles published on Aug 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+