న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానం.. అయినా జట్టులో దక్కని చోటు!!

England announce 14 man squad, Dawid Malan added as reserve for ODIs against Australia

లండన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ టాప్ లేపాడు. 877 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన మలన్..‌ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. మాములుగా అయితే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆటగాడికి జట్టులో కచ్చితంగా చోటు ఉంటుంది. కానీ డేవిడ్‌ మలన్‌ విషయంలో అది రివర్స్ అయింది.

జేసన్ రాయ్‌ వచ్చేశాడు:

జేసన్ రాయ్‌ వచ్చేశాడు:

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కోసం 14 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) బుధవారం ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న విధ్వంసక ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. ట్రైనింగ్ సెషన్ సందర్భంగా గాయపడిన రాయ్..‌ ఇటీవల పాకిస్థాన్‌, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. కోలుకున్న అతడు మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు.

రిజర్వ్‌ ప్లేయర్‌గా మలన్‌ ఎంపిక:

రిజర్వ్‌ ప్లేయర్‌గా మలన్‌ ఎంపిక:

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో 66, 44, 21 పరుగులతో రాణించి టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంకు సాధించిన డేవిడ్‌ మలన్‌కు మాత్రం షాక్ తగిలింది. అతడికి 14 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. అయితే‌ రిజర్వ్‌ ప్లేయర్‌గా మాత్రం ఎంపికయ్యాడు. ‌జేసన్‌ రాయ్ కోలుకోవడంతోనే మలన్‌కు అవకాశం లేకుండా పోయింది. అందులోనూ రాయ్ సీనియర్ ఆటగాడు. మరోవైపు మలన్‌ ఒకే ఒక్క వన్డే ఆడాడు. మాంచెస్టర్‌ వేదికగా శుక్రవారం నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.

ఒక్క వన్డే మాత్రమే:

ఒక్క వన్డే మాత్రమే:

33 ఏళ్ల డేవిడ్‌ మలన్‌ ఇంగ్లండ్ తరఫున 16 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 682 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ (103 నాటౌట్) ఉంది. ఇక 7 అర్ధ శతకాలు కూడా బాదాడు. 2017 నుంచి టీ20లు ఆడుతున్న మలన్‌.. 48.7 యావరేజ్, 146.7 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక్క వన్డే మాత్రమే మలన్‌ ఆడాడు. అందులో 24 పరుగులు చేశాడు. ఇక 15 టెస్ట్ మ్యాచ్‌లలో 724 రన్స్ బాదాడు. ఇందులో ఒక శతకం, 6 అర్ధ శతకాలు ఉన్నాయి.

వన్డే సిరీస్‌ ఇంగ్లండ్ జట్టు:

వన్డే సిరీస్‌ ఇంగ్లండ్ జట్టు:

ఇయన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, టామ్ బాంటన్, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, టామ్ కర్రన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

యువరాజ్‌ సింగ్‌ యూటర్న్.. బీసీసీఐకి లేఖ.. ఇక అభిమానులకు పండగే!!

Story first published: Wednesday, September 9, 2020, 22:22 [IST]
Other articles published on Sep 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X