న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలింగ్ చేసి బౌండరీ ఆపడమా.. స్టోక్స్ నీ కమిట్‌మెంట్‌కు సలాం!

England all-rounder Ben Stokes himself saves a boundary at long-off after bowling


మాంచెస్టర్:
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టెస్ట్‌లో కెప్టెన్‌గా విజయాన్నందించలేకపోయాననే కసో ఏమో కానీ.. అత్యద్బుతమైన ఆట తీరుతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్‌‌లో 57 బంతుల్లోనే 78 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. అలాగే బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
కమిట్‌మెంట్ అంటే..

కమిట్‌మెంట్ అంటే..

అతని బ్యాటింగ్, బౌలింగ్ అంతా ఒకెత్తు అయితే.. మైదానంలో బౌండరీ ఆపడం కోసం అతను పరితపించిన తీరు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆశ్చర్యానికి గురిచేస్తుంది. క్రికెటర్ అంటే ఇలా ఉండాలని అనుకునేలా చేస్తుంది. బౌండరీ ఆపడంలో వింతేం ఉందని అనుకోవచ్చు. కానీ బౌలింగ్ చేసి బౌండరీ లైన్ వరకు పరుగెత్తి బంతిని ఆపడమే స్టోక్స్ కమిట్‌మెంట్, ఫిట్‌నెస్ గురించి మాట్లాడానుకునేలా చేసింది.

బౌండరీ వెళ్లకుండా..

ఆట చివరి రోజు క్రీజులో పాతుకుపోయి బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ప్రత్యర్థి జోడీ.. ఈ పరిస్థితుల్లో బౌలింగ్ చేసే ఏ బౌలర్ అయిన కొంత అలసిపోయి కనిపిస్తారు. కానీ స్టోక్స్ మాత్రం అలా కాకుండా బౌలింగ్ చేసి.. బ్యాట్స్‌మన్ లాంగాఫ్ దిశగా ఆడిన షాట్‌‌ను ఆపేందుకు బంతి వెంట బౌండరీకి పరుగెత్తాడు. బౌండరీ లైన్ తాకకముందే అద్భుతంగా బంతిని అడ్డుకోని పరుగులను సేవ్ చేశాడు. ఇది విండీస్ రెండో ఇన్నింగ్స్ 43 ఓవర్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక అదే ఓవర్‌లో బ్లాక్‌వుడ్‌ను ఔట్ చేసిన స్టోక్స్.. మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పాడు. స్టోక్స్ కీలక వికెట్ తీయడంతో విండీస్ పోరాటం చతికిలపడింది. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్, షమర్ బ్రూక్స్ పోరాడినా ఫలితం లేకపోయింది.

సలాం స్టోక్స్..

సలాం స్టోక్స్..

ఇక స్టోక్స్ కమిట్‌మెంట్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తుంది. సలాం స్టోక్స్ అంటూ కొనియాడుతుంది. ‘మ్యాచ్ గెలవాలనే నీ తపన.. కమిట్‌మెంట్ మాటల్లో వర్ణించలేం'అని ఒకరంటే.. కిక్కిరిసిన మైదానంలో ఇది జరిగుంటే ఎలా ఉండేది ఒక్కసారి ఊహించుకోండని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘స్టోక్స్ ఇలా చేయడం నన్నేం ఆశ్చర్యపర్చలేదు. ఎందుకంటే అతని కోవిడ్-19 వ్యాక్సిన్‌ తీసుకొని బరిలోకి దిగాడు'అని మరొకరు వ్యంగ్యాస్త్రం సంధించాడు. స్టోక్స్ ఓ దిగ్గజమని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఆరంభం నుంచి ఆధిపత్యమే..

ఆరంభం నుంచి ఆధిపత్యమే..

రెండో టెస్ట్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 469 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. స్టోక్స్ 176 పరుగులతో రాణించగా.. డామ్ సిబ్లీ(120) శతకం బాదాడు. అనంతరం వెస్టిండీస్ 287 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ క్రైగ్ బ్రాత్ వైట్(75), బ్రూక్స్ (68), చేజ్(51) ఆదుకున్నారు. అనూహ్యంగా స్టువర్ట్ బ్రాడ్(3/66) చెలరేగి విండీస్ పతనాన్ని శాసించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. స్టోక్స్(78 నాటౌట్) ఫాస్టెస్ట్ ఇన్నింగ్స్‌తో 129/3 పరుగుల వద్ద డిక్లెర్ చేసి ప్రత్యర్థి ముందు 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం విండీస్ 198 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది.

Story first published: Tuesday, July 21, 2020, 19:02 [IST]
Other articles published on Jul 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X