న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Eng vs NZ: చెలరేగిన బౌల్ట్.. ఆదుకున్న లారెన్స్!

England 303 all out, New Zealand off to cautious start
Kane Williamson out for second test | Oneindia Telugu

బర్మింగ్‌హోమ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవైపు ట్రెంట్ బౌల్ట్(4/85), మరోవైపు మ్యాట్ హెన్రీ(3/78) చెలరేగడంతో ఆతిథ్య జట్టు 303 పరుగులకు కుప్పకూలింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ డాన్ లారెన్స్(81 నాటౌట్), ఓపెనర్ రోరీ బర్న్స్(81), టెయిలెండర్ మార్క్ వుడ్(41) మినహా అంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, హెన్నీకి తోడుగా.. అజాజ్ పటేల్ రెండు, వాగ్నర్ ఓ వికెట్ తీశాడు.

ఇక 258/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 45 పరుగులు జోడించి 101 ఓవర్లలో 303 పరుగులకు ఆలౌటైంది. 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును డాన్ లారెన్స్ అజేయ శతకంతో ఆదుకున్నాడు. టేయిలెండర్ మార్క్ వుడ్‌తో కలిసి గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. మార్క్ వుడ్‌ను హెన్రీ బౌల్ట్ చేయడంతో లారెన్స్‌కు అండ లేకుండా పోయింది. స్టువర్ట్ బ్రాడ్(0), జేమ్స్ అండర్సన్(4) త్వరగా ఔటవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్, తాత్కలిక కెప్టెన్ టామ్ లాథమ్‌ను బ్రాడ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో కివీస్ 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో డబుల్ సెంచరీ హీరో డెవాన్ కాన్వే(7), విల్ యంగ్(0) ఉన్నారు.

Story first published: Friday, June 11, 2021, 17:21 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X