న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs SA:పాపం డీన్ ఎల్గర్.. గాశారం గాXX మారేతో కుదా క్యా కర్తా! (వీడియో)

 ENG vs SA: Dean Elgar dismissed in unluckiest fashion off James Anderson’s bowling

లార్డ్స్: ఇంగ్లండ్ పర్యటనలో సౌతాఫ్రికా జోరు కనబరుస్తుంది. వన్డే సిరీస్‌ను సమం చేసి టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన సౌతాఫ్రికా మూడు టెస్ట్‌ల సిరీస్‌లోనూ శుభారంభం దిశగా దూసుకెళ్తుంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో 326 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను ముగించి 161 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. అంతకముందు ఇంగ్లండ్‌ను 165 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్(47) ఔటైన విధానం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ కాగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. మరో ఓపెనర్ సరెల్ ఎర్వీ (73)తో కలిసి నిలకడగా ఆడుతున్న ఎల్గర్‌ను జేమ్స్ అండర్సన్ విచిత్రకర రీతిలో పెవిలియన్ చేర్చాడు. హాఫ్ సెంచరీకి చేరువైన ఎల్గర్‌ను గుడ్ లెంగ్త్ బాల్‌తో ఔట్ చేశాడు. అండర్సన్ వేసిన బంతిని ఎల్గర్ లెగ్ సైడ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. అది కాస్త అతని ఎల్బో గార్డ్‌కు తగి వికెట్ల వైపు దూసుకెళ్లింది. బంతిని ఆపే ప్రయత్నం ఎల్గర్ చేసినా అప్పటికే నెమ్మదిగా వికెట్లను గీరాటేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు గాశారం గాXX మారేతో కుదా క్యాకర్తా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 289/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా 326 పరుగులకు కుప్పకూలింది. మార్కో జాన్సెన్(48), కేశవ్ మహరాజ్(41), అన్రిచ్ నోర్జ్(28 నాటౌట్) పోరాడారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్ మూడేసి వికెట్లు తీయగా.. మాథ్యూ పోట్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, జాక్ తీచ్ తలో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్‌లో బ్రాడ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. కైల్‌ వెరిన్నేను ఔట్‌ చేయడం ద్వారా లార్డ్స్‌ వేదికగా 100 టెస్ట్ వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న రెండో ఇంగ్లండ్‌ బౌలర్‌గా బ్రాడ్‌ నిలిచాడు. అంతకముందు ఇంగ్లండ్‌ స్టార్‌ జేమ్స్‌ అండర్సన్‌(117 వికెట్లు) ఈ ఫీట్ సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే వేదిక(క్రికెట్‌ గ్రౌండ్‌లో)పై 100 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా స్టువర్ట్‌ బ్రాడ్‌ నిలిచాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్‌ ఏకంగా మూడు వేదికల్లో మూడుసార్లు వంద వికెట్ల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత జేమ్స్‌ అండర్సర్‌, రంగనా హెరాత్‌లు ఉన్నారు. తాజాగా వీరి సరసన స్టువర్ట్‌ బ్రాడ్‌ చేరాడు.

Story first published: Friday, August 19, 2022, 17:23 [IST]
Other articles published on Aug 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X