న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3సి, 4ఇ.. కోడ్ భాషలో ఇంగ్లండ్ కెప్టెన్‌కు రహస్య సందేశాలు!! ముదురుతున్న వివాదం!

ENG vs RSA: England team analyst Nathan Leamon conveys coded messages to Eoin Morgan during match

కేప్‌టౌన్‌: మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్‌.. మ‌రో 14 బంతులు మిగిలి ఉండగానే ల‌క్ష్యాన్ని చేరుకుంది. డేవిడ్ మలన్‌ (99; 47 బంతుల్లో, 11×4, 5×6) విధ్వంసం సృష్టించగా.. జోస్‌ బట్లర్ (67; 46 బంతుల్లో, 3×4, 5×6) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించారు. ఫలితంగా మూడు టీ20ల ఇంగ్లీష్ జట్టు సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకుంది. అయితే మూడో టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఇంగ్లండ్ డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి మైదానంలోని కెప్టెన్‌కు రహస్య సందేశాలు పంపండం చర్చనీయాంశమవుతుంది.

3సి, 4ఇ అంటూ రహస్య సందేశాలు

3సి, 4ఇ అంటూ రహస్య సందేశాలు

మూడో టీ20 మ్యాచ్‌ సమయంలో మైదానంలోని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కి డ్రెస్సింగ్‌ రూము నుంచి ఇంగ్లీష్ జట్టు విశ్లేషకుడు నాథన్ లీమన్ రహస్య సందేహాలు పంపాడు. 3సి, 4ఇ అంటూ రాసిన సందేశాల్ని మైదానంలో ఆటగాళ్లకు కనిపించేలా బాల్కనీ రెయిలింగ్‌ వద్ద లీమన్ ఉంచాడు. బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ కూర్పునకి సహాయపడేలా నాథన్ రెయిలింగ్‌ వద్ద కోడ్ భాషలో 3సి, 4ఇ అంటూ ప్రదర్శించాడు. వాటిని చూస్తూ కెప్టెన్ మోర్గాన్ తన వ్యూహాల్ని మార్చుకున్నాడు. మైదానంలోని ఆటగాళ్లకు నాథన్‌ ఇలా రహస్య సందేశాల్ని పంపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇయర్‌ ఫోన్‌లో మాట్లాడటం

ఇయర్‌ ఫోన్‌లో మాట్లాడటం

మైదానంలోని ఆటగాడికి ఇలా డ్రెస్సింగ్ రూము నుంచి సందేశాలు పంపడం ఇదేమీ మొదటిసారి మాత్రం కాదు. 1999 వన్డే ప్రపంచకప్ సమయంలో అప్పటి దక్షిణాఫ్రికా కోచ్ బాబ్ వూమర్ ఇలానే మైదానంలోని కెప్టెన్ హాన్సీ క్రానె, పేసర్‌ అలన్‌ డొనాల్డ్‌తో ఇయన్‌ ఫోన్‌ సాయంతో మాట్లాడి.. వ్యూహాలని రచించడంలో సాయపడ్డాడు. ఇలా ఇయర్‌ ఫోన్‌లో మాట్లాడటం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. దీంతో మైదానంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెంటనే నిషేధం విధించింది.

మ్యాచ్‌ రిఫరీకి సమాచారం ఇచ్చిన తర్వాతే

మ్యాచ్‌ రిఫరీకి సమాచారం ఇచ్చిన తర్వాతే

ఇక 2017లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఔటైన స్టీవ్ ‌స్మిత్‌ని డీఆర్‌ఎస్ కోరాల్సిందిగా డ్రెస్సింగ్ రూము నుంచి సహాయ సిబ్బంది సిగ్నల్స్ ఇచ్చారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ విషయాన్ని పసిగట్టి.. వెంటనే అంపైర్లకి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం కూడా అప్పట్లో పెద్ద దుమారం రేగింది. అయితే నాథన్ లీమన్ కోడ్ భాషలో రహస్య సందేశాలు పంపడాన్ని ఇంగ్లీష్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సమర్థించుకున్నాడు. మ్యాచ్‌ రిఫరీకి సమాచారం ఇచ్చిన తర్వాతే తాము ఇలా చేశామని పేర్కొన్నాడు. లీమన్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఏం నడుచుకోలేదన్నాడు.పేసర్‌ మార్క్‌ వుడ్‌ కూడా లీమన్‌ చర్యలను సమర్థించాడు. మరి ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

హ్యాట్సాఫ్.. కోహ్లీ!! మొన్న తిట్టాడు..ఈరోజు పొగిడాడు!

Story first published: Friday, December 4, 2020, 13:06 [IST]
Other articles published on Dec 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X