న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తమ్ముడు బౌలింగ్.. అన్న బ్యాటింగ్!! ఆరు బంతుల్లో 6 సిక్సులు! తల్లి ఆనందం

Dwayne Smith hits six sixes in brothers Kemar Smith bowling

హైదరాబాద్: బార్బడోస్‌లోని ఈడెన్ లాడ్జ్‌లో జరిగిన క్లబ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ స్మిత్.. తన తోబుట్టువు కేమర్ స్మిత్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదాడు. 2015లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 37 ఏళ్ల స్మిత్. ఇటీవలి కాలంలో పేరొందిన టీ20 లీగ్‌లు (ఐపీఎల్, పీఎస్‌ఎల్, సీపీఎల్) ఏదీ ఆడలేదు. కానీ తాజా క్లబ్ మ్యాచ్‌లో మాత్రం తొలి ఓవర్లోనే వరుసగా ఆరు సిక్సులు బాదడం గమనార్హం. తన జట్టు ఎర్రోల్ హోల్డర్ స్టార్స్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. సోమవారం సీఆర్‌బీ జట్టుతో ఎర్రర్ హోల్డర్ మ్యాచ్ ఆడింది.

 ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన డ్వేన్:

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన డ్వేన్:

ఎ అండ్ ఎ ఆటో పార్ట్స్ ఎర్రోల్ హోల్డర్ టెన్10 క్లాసిక్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఎర్రర్ హోల్డర్ స్టార్స్, సీఆర్‌బీ జట్లు తలపడ్డాయి. డ్వేన్ స్మిత్ ఎర్రోల్ హోల్డర్ స్టార్స్ జట్టు తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగగా.. సీఆర్‌బీ తరఫున కేమర్ స్మిత్ తొలి ఓవర్ వేశాడు. అన్నదమ్ముల ఆట చూసేందుకు స్మిత్ బ్రదర్స్ అమ్మ (లోరైన్ స్మిత్) కూడా స్టేడియానికి వచ్చారు. స్పిన్నర్ కేమర్ వేసిన తొలి ఓవర్లోనే డ్వేన్ రెచ్చిపోయాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు.

కేమర్‌ గోల్డెన్ డక్‌:

కేమర్‌ గోల్డెన్ డక్‌:

తమ్ముడు కేమర్ స్మిత్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన డ్వేన్ స్మిత్.. 36 పరుగులు పిండుకున్నాడు. మరో పది పరుగులు చేసిన తర్వాత ఆష్లే నర్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత కేమర్‌ స్మిత్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు అతణ్ని డ్వేన్ స్మిత్ ఔట్ చేశాడు. కేమర్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఫ్రంట్‌లైన్ బౌలర్ కాదు. అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తుంటాడు. మొత్తానికి సోదరుల పోరులో తమ్ముడిపై అన్న పైచేయి సాధించాడు. సోదరుల సమరంను వారి అమ్మ కూడా ఎంజాయ్ చేశారు.

ఐపీఎల్‌లో చెన్నై తరఫున:

ఐపీఎల్‌లో చెన్నై తరఫున:

కేమర్ స్మిత్ ఇప్పటి వరకూ బార్బడోస్ తరఫున ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఈ ఆఫ్ స్పిన్నర్ ఇంగ్లాండ్‌లో ప్రొఫెషనల్ క్రికెట్ మాత్రం ఆడాడు. తమ్ముడి బౌలింగ్ వరుసగా ఆరు సిక్సులు బాదిన డ్వేన్.. అతడింకా మెరుగవ్వాల్సి ఉందని నిరూపించాడు. మరోవైపు 37 ఏళ్ల డ్వేన్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజ్ క్రికెట్‌లో కూడా ఆడాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గతంలో ఆడాడు. డ్వేన్ వెస్టిండీస్ జట్టు‌కు 10 టెస్టులు, 105 వన్డేలు, 33 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 75 వికెట్లతో పాటు అన్ని ఫార్మాట్లలో 2 వేలకు పైగా పరుగులు చేశాడు.

ఫార్ములా వన్‌ చాంపియన్‌ హామిల్టన్‌కు కరోనా!!

Story first published: Tuesday, December 1, 2020, 18:45 [IST]
Other articles published on Dec 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X