న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అది విరాట్ కోహ్లీ నుంచే నేర్చుకున్నా'

Dont Believe There is Competition But No Room for Complacency in Indian Team: Agarwal

హైదరాబాద్: ఎప్పుడైనా టీమిండియాకు ఆడతానా? అని ఆశ్చర్యపోతుంటే టెస్టుల్లో భారత జట్టు ప్రధాన ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు. అతడే మయాంక్ అగర్వాల్. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ ఫరవాలేదనిపించాడు.

ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అక్టోబర్ 2 నుంచి సఫారీలతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ఎంపికయ్యాడు. ఓపెనర్‌గా రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.

బెన్ స్టోక్స్‌కు 'ది సన్' స్ట్రోక్: ట్విట్టర్‌లో భావోద్వేగ పోస్టు
మైదానంలోని పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకున్నట్లు తెలిపాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ టూర్ల నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. స్వదేశంలో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమని, దక్షిణాఫ్రికాపై బాగా ఆడి సిరీస్‌ గెలుపొందుతామనే నమ్మకం ఉందని అన్నాడు.

"నేను మరింత కష్టపడుతున్నాను. మరింత ఫిట్‌గా ఉండాలని నేను నమ్ముతున్నాను. నేను ఇప్పుడు నా ఆటను బాగా అర్థం చేసుకున్నాను. విభిన్న పరిస్థితులకు నేను ఎలా స్పందిస్తానో విషయంలో నేను మరింత పరిణతి చెందాను. ఉదాహరణకు, గ్రీన్‌టాప్ లేదా తడిసిన వికెట్‌పై ఏ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే దానిపై నేను మంచి నిర్ణయాలు తీసుకుంటాను" అని మయాంక్ అన్నాడు.

భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, అత్యుత్తమ ఆట ఆడే క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని జయిస్తానని మయాంక్‌ చెప్పాడు. బ్యాటింగ్ చేసి జట్టుని విజయపథంలో నడపించడమే తన చేతుల్లో ఉందని, మిగతా విషయాలను తాను పట్టించుకోనని చెప్పాడు.

Story first published: Tuesday, September 17, 2019, 20:01 [IST]
Other articles published on Sep 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X