బెన్ స్టోక్స్‌కు 'ది సన్' స్ట్రోక్: ట్విట్టర్‌లో భావోద్వేగ పోస్టు

హైదరాబాద్: తన కుటుంబానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని ప్రచురించినందుకు గాను 'ది సన్' డైలీపై ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవలే సొంతగడ్డపై ముగిసిన ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో బెన్ స్టోక్స్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో సెంచరీ సాధించి ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో 'ది సన్' పత్రిక 'స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ' అనే కథనాన్ని ప్రచురించింది. బెన్ స్టోక్స్ జన్మించడానికి మూడేళ్ల ముందు అతడి కుటుంబంలో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

అతి కిరాతకంగా హత్య
బెన్ స్టోక్స్ సోదరి, సోదరుడుని అతడి తల్లి మాజీ ప్రియుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ వార్తను మూడు దశాబ్దాల తర్వాత హైలెట్ చేస్తూ ది సన్ పత్రిక వార్తకథనాన్ని ప్రచురించింది. బెన్ స్టోక్స్ కుటుంబానికి సంబంధించిన ఈ సున్నితమైన అంశాన్ని ఇప్పుడు ప్రచురించడంపై స్టోక్స్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నేను చాలా బాధపడ్డా
"ఈ రోజు సన్ పత్రికలో వచ్చిన వార్తను చూసి నేను చాలా బాధపడ్డా. నా వ్యక్తిగత, బాధకరమైన విషయాన్ని బహిర్గతం చేశారు. ఎప్పుడో 31 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి మమ్మల్ని ఆవేదనకు గురిచేశారు. జర్నలిజం విలువలను ఏ మాత్రం పట్టించుకోకుండా ‘ది సన్' వ్యవహరించింది" అంటూ ట్వీట్ చేశాడు.
రిపోర్టర్లు మా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో
"మూడు రోజుల క్రితం రిపోర్టర్లు మా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో ఈ విషయం గురించి గుచ్చిగుచ్చి అడిగిన తీరు నన్నెంతో బాధకు గురి చేసింది. మా కుటుంబానికి చెందిన విషాదకర విషయాన్ని అప్పటి నుంచి మా గుండెల్లోనే దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలిపి ‘ది సన్' ఏదో సాధించిందని సంతోష పడుతుంది. మీ కుటుంబానికి చెందిన సున్నితమైన, వ్యక్తిగత విషయాన్ని ఫ్రంట్ పేజీలో ప్రచురించగలరా?" అని ట్విట్టర్‌లో స్టోక్స్ భావోద్వేగ పోస్టు పెట్టాడు.

441 పరుగులు చేసిన బెన్ స్టోక్స్
ఇటీవలే ముగిసిన ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో బెన్ స్టోక్స్ 55.12 యావరేజితో మొత్తం 441 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దీనికి తోడు 8 వికెట్లు కూడా పడగొట్టాడు. గత ఆదివారం ఓవల్ వేదికగా ముగిసిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ 2-2తో సమం అయింది. 47 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్ డ్రా కావడం ఇదే తొలిసారి. సిరీస్ డ్రా అయినప్పటికీ, ట్రోఫీ మాత్రం ఆస్ట్రేలియా దగ్గరే ఉంటుంది. గత యాషెస్ సిరిస్‌లో ఆసీస్ గెలిచినందున ట్రోఫీని వారి వద్దే ఉండనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications