న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గృహహింస కేసు: మహ్మద్‌ షమీకి ఊరట.. అరెస్టుపై స్టే

Mohammed Shami Gets Stay From District Court || Oneindia Telugu
District court stays arrest warrant against Indian pacer Mohammed Shami

కోల్‌కతా: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్‌ షమీ భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహహింస కేసులో అతనికి ఊరట లభించింది. షమీ అరెస్టుపై పశ్చిమ బంగాల్‌లోని అలీపోర్‌ న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. అలీపోర్‌ న్యాయస్థానం దాదాపు రెండు నెలల పాటు స్టే విధించిందని షమీ తరఫు న్యాయవాది సలీం రెహ్మాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ కేసు తదుపరి విచారణ నవంబర్‌ 2న జరుగనుంది.

<strong>డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌.. టాప్‌-5కి బియాంకా ఆండ్రిస్కూ</strong>డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌.. టాప్‌-5కి బియాంకా ఆండ్రిస్కూ

 498ఏ సెక్షన్ కింద కేసు నమోదు:

498ఏ సెక్షన్ కింద కేసు నమోదు:

గత ఏడాది మార్చిలో షమీ భార్య హసీన్ అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించింది. ఇందుకు సంబంధించి పలు వాట్సాప్ ఛాటింగ్ స్ర్కీన్ షాట్‌లు, ఫొటోలు కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాక.. షమీ, అతని కుటుంబ సభ్యులు తనపై హత్యాయత్నం చేశారని, లైంగికంగా వేధించారని ఆమె గృహహింస కేసు పెట్టింది. దీంతో షమీతో పాటు అతని సోదరునిపై ఐపీసీ 498ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

షమీపై అరెస్టు వారెంట్‌:

షమీపై అరెస్టు వారెంట్‌:

కేసు నమోదయిన సమయం నుండి షమీ న్యాయస్థానం ముందు హాజరుకాలేదు. దీంతో ఇటీవలే షమీపై అరెస్టు వారెంట్‌ జారీ అయింది. షమీతో పాటు అతడి సోదరుడు హసిద్ అహ్మద్‌కు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇద్దరు 15 రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని అలిపోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే షమీ వెస్టిండీస్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో.. అక్కడి నుండి వచ్చిన 15 రోజుల లోపు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

షమీ అరెస్టుపై స్టే:

షమీ అరెస్టుపై స్టే:

ఈ గృహహింస కేసులో షమీ అరెస్టుపై అలీపోర్‌ న్యాయస్థానం స్టే విధించింది. న్యాయస్థానం దాదాపు రెండు నెలల పాటు స్టే విధించించింది. ఇక ఈ కేసు తదుపరి విచారణ నవంబర్‌ 2న జరుగనుంది. భారత్‌ తరుపున షమీ ఇప్పటివరకు 42 టెస్టులు, 70 వన్డేలు, ఏడు టీ20 ఆడాడు. టెస్టుల్లో 153, వన్డేల్లో 131, టీ20ల్లో 8 వికెట్లు తీసాడు. అయితే ఈ నెలలో జరగనున్న దక్షిణాఫ్రికా పర్యటనకు బీసీసీఐ షమీకి విశ్రాంతిని ఇచ్చింది.

భారత్‌ vs దక్షిణాఫ్రికా: 15 నుంచి వైజాగ్‌ టెస్ట్‌ మ్యాచ్ టికెట్ల విక్రయం

Story first published: Tuesday, September 10, 2019, 11:14 [IST]
Other articles published on Sep 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X