
దిగ్గజాలను విస్మరించిన అఫ్రిది
లాక్‌డౌన్ సమయంలో తన స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తు బిజీగా ఉంటున్న ఈ పాక్ మాజీ కెప్టెన్.. గురువారం తమ దేశ యాంకర్ సనా బుచాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్రపంచకప్ అత్యుత్తమ జట్టును ఎంపిక చేశాడు. అయితే ఈ జట్టులో ప్రపంచకప్ టోర్నీల్లో అద్భుత రికార్డులు కలిగిన దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, ఇమ్రాన్ ఖాన్, యువరాజ్ సింగ్‌లతో పాటు.. గతేడాది జరిగిన ఈ మెగాటోర్నీలో టాప్‌పెర్ఫామెన్స్ కనబర్చిన రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌లను విస్మరించాడు.

ఐదుగురు పాక్ ఆటగాళ్లే..
11 మంది సభ్యుల్లో ఐదుగురు పాకిస్థాన్ ఆటగాళ్లను ఎంపిక చేసిన ఈ మాజీ స్పిన్నర్.. చివరకు తన పేరును కూడా చేర్చుకోలేదు. ఆస్ట్రేలియా ప్లేయర్లను నలుగురిని తీసుకున్న అఫ్రిది.. సౌతాఫ్రికా, భారత్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేశాడు. భారత్ నుంచి ఎంపికైన ఆ ఒక్కడు కూడా విరాట్ కోహ్లీనే. అయితే విరాట్‌కు ప్రపంచకప్ టోర్నీల్లో మంచి రికార్డు లేకపోవడం గమనార్హం. మూడు ప్రపంచకప్‌ల్లో 26 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కేవలం 1030 పరుగులే చేశాడు.

ఓపెనర్లుగా గిల్‌క్రిస్ట్..
ఓపెనర్లుగా సయిద్ అన్వర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లను, ఆసీస్‌కు వరుసగా రెండు ప్రపంచకప్‌లు అందించిన రికీ పాంటింగ్‌ను మూడో స్థానంలో తీసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఎంపిక చేయగా.. ఇంజమామ్ ఉల్ హక్‌కు ఐదో స్థానం కేటాయించాడు. ఒకే ఒక ఆల్‌రౌండర్‌కు అవకాశమిచ్చిన అఫ్రిది ఆ స్థానంలో జాక్వస్ కల్లిస్‌ను తీసుకున్నాడు. వసిమ్ అక్రమ్, షోయబ్ అక్తర్, గ్లేన్ మెక్‌గ్రాత్‌తో పేస్ దళాన్ని.. షేన్ వార్నర్, సక్లైన్ ముస్తక్‌తో స్పిన్ విభాగాన్ని పూర్తి చేశాడు. అయితే ఈ జట్టుకు మాత్రం కెప్టెన్ ఎవరో చెప్పలేదు.

అఫ్రిది ఆల్‌టైమ్ వరల్డ్ ఎలెవన్:
సయీద్ అన్వర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, ఇంజమామ్ ఉల్ హక్, జాక్వస్ కల్లిస్, వసీం అక్రమ్, గ్లేన్ మెక్ గ్రాత్, షేన్ వార్నర్, షోయబ్ అక్తర్, సక్లైన్ ముస్తాక్
మహ్మద్ షమీ భార్యపై మండిపడుతున్న ఫ్యాన్స్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్!


Click it and Unblock the Notifications












