న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మూడో టీ20లో ధావన్‌, శాంసన్‌ మెరుస్తారు.. వారిద్దరూ మెరుగైన స్కోర్‌ చేశారంటే ఏం జరుగుతుందో తెలియదు'

Dhawan, Samson will be pillars of IND vs SL 3rd T20I batting lineup feels Aakash Chopra
Ind Vs SL T20: Teamindia Batsmen నలుగురే.. తుడిజట్టు ఇదే | Oneindia Telugu

ముంబై: టీమిండియా కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌, యువ వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌కు భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా అండగా నిలిచాడు. మూడో టీ20లో ధావన్‌, శాంసన్‌ మెరుస్తారని ధీమా వ్యక్తం చేశాడు. సిరీస్ డిసైడర్ మ్యాచులో వీరిద్దరే కీలకం అవుతారన్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్‌ చేసే పరుగులు బోనస్‌ అని ఆకాశ్‌ చోప్రా చెప్పాడు.

గురువారం ఇరు జట్ల మధ్య సిరీస్‌ విజేతను నిర్ణయించే మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచిన ధావన్ సేన.. పొట్టి సిరీస్ కూడా పట్టాలని చూస్తోంది. మరోవైపు పటిష్ట లంక మూడో మ్యాచ్ గెలిచి వన్డే సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 విఫలమైన శాంసన్

విఫలమైన శాంసన్

బుధవారం జరిగిన రెండో టీ20లో భారత్ తక్కువ పరుగులే చేసిన సంగతి తెలిసిందే. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులే చేసింది. శిఖర్ ధావన్‌ (40), రుతురాజ్‌ గైక్వాడ్ (21), దేవదత్‌ పడిక్కల్ (29) మినహా అందరూ విఫలమయ్యారు. స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్, నితీష్ రాణాలు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఇక లంక సైతం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తడబడింది. కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ కుమార్ తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని పరీక్షించారు. ఆఖరి ఓవర్లో గానీ ఆ జట్టుకు విజయం లభించలేదు.

ధావన్‌, శాంసన్‌ మెరుస్తారు

ధావన్‌, శాంసన్‌ మెరుస్తారు

తాజాగా ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'చివరి టీ20లో భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌కు శిఖర్‌ ధావన్‌, సంజు శాంసన్‌ మూల స్తంభాలు. రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌, నితీశ్‌ రాణా చేసే పరుగులు బోనస్‌ అనే చెప్పాలి. ధావన్‌, సంజు మెరుగైన స్కోర్‌ చేశారంటే.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇద్దరూ భారీ ఇన్నింగ్స్ ఆడగలరు. ఇక చివరి గీత ఎలా దాటాలో ప్రస్తుత శ్రీలంక జట్టుకు తెలియదు. రెండో టీ20లోనూ వారు ఇబ్బంది పడ్డారు' అని అన్నాడు.

మైదానంలో అభినందించాడు.. డ్రెసింగ్ రూమ్‌లో ఎమోషనల్ అయ్యాడు! బాటిల్‌ను నేలకేసికొట్టిన లంక ప్లేయర్!!

సైనీ ఔట్

సైనీ ఔట్

రెండో టీ20 సందర్భంగా టీమిండియా స్టార్‌ పేసర్‌ నవదీప్ సైనీ గాయపడ్డాడు. ప్రస్తుతం అతడిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. అయితే గాయం తీవ్రంగా ఉండడంతో నిర్ణయాత్మక మ్యాచ్‌ నుంచి అతను తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు అందుబాటులో లేక సతమతమవుతున్న సమయంలో సైనీ గాయం టీమిండియాను మరింత ఇబ్బంది పెడుతోంది.

కనీసం పదకొండు మంది ఆటగాళ్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ప్రస్తుతం భారత జట్టులో నెలకొంది. సైనీ స్థానంలో తమిళనాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిషోర్‌కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సాయితో పాటు అర్షదీప్‌ సింగ్‌ మాత్రమే ప్రస్తుతం టీమిండియా బెంచ్‌పై ఉన్నారు.

తుది జట్టు (అంచనా)

తుది జట్టు (అంచనా)

భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కీపర్), నితీశ్ రాణా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, నవ్‌దీప్ సైనీ, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా.

Story first published: Thursday, July 29, 2021, 18:46 [IST]
Other articles published on Jul 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X