న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాలో స్థానం కోసం దేవదర్ ట్రోఫీని వేదికగా..

Deodhar Trophy: Chance for Ajinkya Rahane, Ravichandran Ashwin

హైదరాబాద్: అరంగ్రేట మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీతో అదరగొట్టేసి జట్టులో గుర్తింపు తెచ్చేసుకున్న పృథ్వీ షాపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్లకు జట్టులో చోటు దక్కడంపై తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మరింత మెరుగయ్యేందుకు సీనియర్లు తెగ కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే దేవదర్ ట్రోఫీలో రాణించి తమ ప్రత్యేకతను చాటుకోవాలని రహానె, రవిచంద్రన్ అశ్విన్‌లు సిద్ధమైయ్యారు.

దేవదర్ ట్రోఫీలో ప్రతిభను మెరుగుపరుచుకోవడం

దేవదర్ ట్రోఫీలో ప్రతిభను మెరుగుపరుచుకోవడం

ప్రపంచ కప్ మొదలవడానికి ఇంకా 17వన్డేలే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో జట్టులో స్థానం కోసం ఆటగాళ్లతో పాటు సెలక్టర్లు సైతం తర్జనభర్జనలు పడుతున్నారు. అక్టోబరు 23 నుంచి మొదలుకానున్న దేవదర్ ట్రోఫీలో ప్రతిభను మెరుగుపరుచుకోవడం ద్వారా పరిమిత ఓవర్ల సిరీస్‌లో తమ ప్రతిభను మెరుగుపరచుకోవాలని రహానె లాంటి బ్యాట్స్‌మెన్ ఎదురుచూస్తున్నారు. జూలై 2017 నుంచి పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉంటున్న రవిచంద్రన్ అశ్విన్ ఈ ట్రోఫీ ద్వారా మళ్లీ వన్డేల్లో ఆడుతున్నాడు.

మళ్లీ మైదానంలో క్రికెటర్‌గా అడుగుపెట్టనున్న జహీర్‌ఖాన్

అశ్విన్ ఆడుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్న జడేజా

అశ్విన్ ఆడుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్న జడేజా

తనతో పాటుగా సహచర ఆటగాడు అశ్విన్ ఆడుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నాడు రవీంద్ర జడేజా. ఈ ట్రోఫీలో తమిళనాడు క్రికెటర్ దినేశ్ కార్తీక్.. కూడా దాదాపు ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కొద్ది నెలల క్రితం లంక పర్యటనలో భారత్ నిదహాస్ ట్రోఫీలో ఆడింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ పరుగులు అవసరం ఉండగా చివర్లో సిక్సు బాది మ్యాచ్‌ను గెలిపించాడు దినేశ్ కార్తీక్.

ధోనీకి ప్రత్యామ్నాయంగా వికెట్ కీపింగ్ బాధ్యతలు

ధోనీకి ప్రత్యామ్నాయంగా వికెట్ కీపింగ్ బాధ్యతలు

యువ క్రికెటర్ రిషబ్ పంత్ వెలుగులోకి రావడంతో ధోనీకి ప్రత్యామ్నాయంగా వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న దినేశ్ కార్తీక్‌కు జట్టులో చోటు అనుమానస్పదంగానే కనిపిస్తోంది. వచ్చే ఏడాది రానున్న ప్రపంచ కప్ టోర్నీ గురించే కాకుండా ఈ వెస్టిండీస్‌లతో సిరీస్ అనంతరం జరగనున్న ఆస్ట్రేలియా పర్యటన గురించి సైతం జట్టులో పోటీ నెలకొంది. అయితే వారి స్థానాలను పృథ్వీ షా, కరుణ్ నాయర్‌లు కొట్టేస్తారా అనేది చూడాల్సిందే.

నం. 4 రాయుడు మాత్రమే సరిపోగలడని

నం. 4 రాయుడు మాత్రమే సరిపోగలడని

ఈ సందర్భంగా ఫిబ్రవరి నుంచి వన్డే సిరీస్‌కు దూరంగా ఉంటున్న రహానె ఈ ట్రోఫీలో తన ప్రతిభను చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంబటి రాయుడు మాత్రమే సరిపోగలడని భావిస్తున్న నాలుగో స్థానానికి అర్హుడని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. చాలా వరకూ విజయ్ హజారే ట్రోఫీలో భారత్ ఏబీసీ జట్లు తరపున ఆడి ప్రతిభను చాటుకుని తదనుగుణంగా టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ప్రయత్నించిన ఆటగాళ్లంతా ఇప్పుడు రూటు మార్చారు. అక్టొబరు 27న జరగనున్న ఫైనల్‌లో టైటిల్ ఎవరు పట్టేయనున్నారో వేచి చూడాలి. ప్రస్తుత భారత్ ఏ జట్టుకు దినేశ్ కార్తీక్, భారత్ బీ జట్టుకు శ్రేయాస్ అయ్యర్, భారత్ సీ జట్టుకు రహానెలు కెప్టెన్సీ వహించనున్నారు.

Story first published: Tuesday, October 23, 2018, 13:07 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X