న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ మైదానంలో క్రికెటర్‌గా అడుగుపెట్టనున్న జహీర్‌ఖాన్

UAE league: Zaheer Khan leads the T10 pack

హైదరాబాద్: టీమిండియా ఒకప్పటి పేసర్‌ జహీర్‌ ఖాన్‌ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇంతకుముందు వార్తల్లో వినిపించినట్లు మైక్‌లు పట్టుకొని ఇతర మాజీల మాదిరి వ్యాఖ్యాతగా కనిపించట్లేదు. ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసేందుకు వస్తున్నాడని అనుకుంటున్నారా? అలా ఏమీ కాదు. తనదైన శైలిలో బంతులు విసిరేందుకే వస్తున్నాడు. టీ10 లీగ్‌ రెండో ఎడిషన్‌లో జహీర్ ఖాన్‌ ఆడనున్నాడు.

 తొలి ఎడిషన్‌లో సెహ్వాగ్‌ ప్రధాన ఆకర్షణగా

తొలి ఎడిషన్‌లో సెహ్వాగ్‌ ప్రధాన ఆకర్షణగా

నవంబర్‌ 23 నుంచి షార్జాలో ఈ టోర్నీ ఆరంభం కానుంది. తొలి ఎడిషన్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. భారత్‌ నుంచి అప్పుడు ఒక్కడే ఆడగా ఈ సారి మాత్రం ఎక్కువమందే లీగులో భాగం పంచుకుంటున్నారు. జహీర్‌ ఖాన్‌, ప్రవీణ్ కుమార్‌, ఆర్పీ సింగ్‌, ఆర్‌ఎస్‌ సోధి, సుబ్రమణ్యం బద్రీనాథ్‌, మరో ముగ్గురు ఆడనున్నారు.

క్రికెటర్ల భార్యలను పర్యటనలకు అనుమతించాల్సిందే..!!

షేన్‌ వాట్సన్‌ సైతం టీ10లో మెరుపులు

షేన్‌ వాట్సన్‌ సైతం టీ10లో మెరుపులు

వెస్టిండీస్‌ విధ్వంస ఆటగాడు క్రిస్‌గేల్‌, ఆసీస్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ సైతం టీ10లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగనున్న ప్లేయర్ల మాట అటుంచితే.. వీరేందర్ సెహ్వాగ్ మాత్రం ఓ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.

 ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఆడటం చాలా

ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఆడటం చాలా

‘టీ10 రెండో ఎడిషన్‌లో ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఆడటం చాలా సంతోషకరం. రానున్న కాలంలో ఈ లీగ్‌లో దేశవిదేశాలకు చెందిన ఎక్కువ ఆటగాళ్లను ఆకర్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది' అని లీగ్‌ ఛైర్మన్‌ షాజీ ఉల్‌ ముల్క్‌ తెలిపారు.

80మంది ఆటగాళ్లు ఆడుతుండగా..

80మంది ఆటగాళ్లు ఆడుతుండగా..

ఈ లీగ్‌కు 80మంది ఆటగాళ్లు ఆడుతుండగా.. వారిలో క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, డేన్ స్మిత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ షెహ్‌జాద్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, జాసన్ రాయ్, శామ్ బిల్లింగ్స్‌లు ముఖ్యులు. ఈ లీగ్ ప్రసార హక్కులు భారత్‌లో ప్రసార హక్కులను సోనీ నెట్ వర్క్ చేస్తుండగా.. నిర్వహణ పనులను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చూసుకుంటోంది.

Story first published: Tuesday, October 23, 2018, 9:52 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X