న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రఫ్ఫాడించిన దీప్తి శర్మ.. తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ గెలుపు

 Deepti Sharma, Vastrakar helps India Beat Sri Lanka by Four Wickets to Take 1-0 Lead

కొలంబో: శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు.. తాజాగా మూడు వన్డేల సిరీస్‌లోను శుభారంభం చేసింది. పల్లెకెల వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత అమ్మాయిలు 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించారు. టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(3/25, 22 నాటౌట్)ఆల్‌రౌండ్‌షోతో విజయంలో కీలక పాత్ర పోషించింది.

చెలరేగిన దీప్తీ..

చెలరేగిన దీప్తీ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో నీలాక్షి డిసిల్వా(63 బంతుల్లో 4 ఫోర్లతో 43), హసిని పెరీరా(54 బంతుల్లో 5 ఫోర్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రేణుకా సింగ్ మూడేసి వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌కు తలో వికెట్ దక్కింది.

 హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్..

హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్..

అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన భారత్ 39 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. భారత జట్టులో షెఫాలీ వర్మ(40 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 35), హర్మన్ ప్రీత్ కౌర్(63 బంతుల్లో 3 ఫోర్లతో 44), హర్లీన్ డియోల్(40 బంతుల్లో 2 ఫోర్లతో 34) రాణించారు. లంక బౌలర్లలో రానా వీరా 4 వికెట్లు తీయగా... రణసింగే రెండు వికెట్లు పడగొట్టింది.

 వరుసగా వికెట్లు..

వరుసగా వికెట్లు..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ హసిని పెరీరా రాణించినా మరో ఓపెనర్, కెప్టెన్ చమరి ఆటపట్టు (2) తో పాటు హన్సిమా కరుణరత్నె (0)లు విఫలమయ్యారు. మాదవి (28) కూడా నిలదొక్కుకోలేదు. దీంతో లంక.. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత నీలాక్షి డి సిల్వ ఆదుకునే ప్రయత్నం చేసినా ఆమెకు సహకరించేవారు లేకపోవడంతో లంక భారీ స్కోరు చేయలే

తడబడినా గెలిచిన భారత్..

తడబడినా గెలిచిన భారత్..

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు కూడా తడబడింది. స్మృతి మంధాన (4), యస్తికా భాటియా (1) వికెట్లను ఆరంభంలోనే కోల్పోయింది. 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఫెఫాలీ వర్మ (35) ధాటిగా ఆడి ఆదుకుంది. ఆమెకు తోడుగా హర్మన్ ప్రీత్ కౌర్ (44), హలీన్ డియోల్ (34) లు ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దీప్తి శర్మ (22 నాటౌట్), పూజా వస్త్రకార్ (21 నాటౌట్) కూడా రాణించడంతో విజయం ఖాయమైంది. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి బ్యాటింగ్‌లో కూడా రాణించిన దీప్తి శర్మ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Story first published: Friday, July 1, 2022, 20:06 [IST]
Other articles published on Jul 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X