న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దీపక్ చాహర్‌కు చేదు అనుభవం.. మలేషియా ఎయిర్‌లైన్స్‌పై మండిపడ్డ టీమిండియా పేసర్!

Deepak Chahar slams ‘Malaysian Airlines for poor service’ asks how he play 1st ODI against Bangladesh

ఢాకా: టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైన దీపక్ చాహర్.. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో అక్కడికి చేరాడు. కానీ మలేషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దీపక్ చాహర్ లగేజి రాలేదు.

ఆదివారం ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డే‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తన లగేజీ ఇంకా రాకపోవడంతో ఈ మ్యాచ్ ఎలా ఆడాలని దీపక్ చాహర్ మలేషియా ఎయిర్‌లైన్స్‌ను నిలదీసాడు. ఫ్లైట్ దిగి 24 గంటలు గడిచినా ఇంతవరకు లగేజీ రాలేదని మండిపడ్డాడు. అత్యంత చెత్త సర్వీస్ అంటూ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.

చెత్త సర్వీస్..

'మలేషియా ఎయిర్‌లైన్స్‌లో చేధు అనుభవం ఎదురైంది. అత్యంత చెత్త సర్వీస్. ముందు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్ మార్చారు. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించినా తినడానికి ఫుడ్ ఇవ్వలేదు. గత 24 గంటలుగా నా లగేజీ కోసం ఎదురు చూస్తున్నా. అసలు రేపు జరిగే తొలి వన్డే మ్యాచ్‌ను ఎలా ఆడాలి. అత్యంత చెత్త సర్వీస్'అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మలేషియా ఎయిర్‌లైన్స్‌కు ట్యాగ్ చేశాడు.

చాహర్.. క్షమించండి..

ఇక దీపక్ చాహర్ ట్వీట్‌‌పై మలేషియా ఎయిర్‌లైన్స్ భారత పేసర్‌కు క్షమాపణలు చెప్పింది. 'హాయ్ దీపక్ చాహర్.. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వీలైనంత వరకు ప్రయాణికలకు ఇబ్బందులు కలగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం. సమయానికి ఫ్లైట్స్ వచ్చేలా పని చేస్తాం.'అని బదులిచ్చింది. తమ కస్టమర్ సర్వీస్‌కు కాల్ చేసి లగేజీ గురించి సమాచారం తెలుసుకోవాలని మరో ట్వీట్‌లో సూచించింది. అయితే అది పని చేయడం లేదని దీపక్ చాహర్ ప్రశ్నించగా.. తమ ప్రతినిధే స్వయంగా మిమ్మల్ని సంప్రదిస్తారని చెబుతూ మరోసారి క్షమాపణలు కోరింది.

 మలేషియా ఎయిర్‌లైన్స్‌కు అలవాటే..

మలేషియా ఎయిర్‌లైన్స్‌కు అలవాటే..

దీపక్ చాహర్‌ అసౌకర్యానికి గల కారణాలను తెలుసుకునేందుకు మలేషియా ఎయిర్‌లైన్స్ అంతర్గత విచారణ చేపట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. అయితే మలేషియా ఎయిర్‌లైన్స్‌లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని, సాధారణ ప్రజలు రోజు ఇలాంటి బాధలు ఎదుర్కొంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సెలెబ్రిటీలు ఇలా ఫిర్యాదు చేసినప్పుడే మలేషియా ఎయిర్‌లైన్స్ స్పందిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తుది జట్టులో చోటు ఖాయం..

తుది జట్టులో చోటు ఖాయం..

మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. ఆదివారం జరిగే తొలి వన్డేతో సిరీస్ వేటను ప్రారంభించనుంది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గాయంతో దూరమైన నేపథ్యంలో దీపక్ చాహర్ కీలకం కానున్నాడు. బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటంతో పాటు పవర్ ప్లేలో రాణించడం అతనికి అదనపు బలం. తొలి వన్డేలో అతనికి తుది జట్టులో చోటు ఖాయం. మ్యాచ్ సమయానికి లగేజి రాకుంటే ఇతర జెర్సీలతో దీపక్ చాహర్ మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది.

Story first published: Saturday, December 3, 2022, 11:33 [IST]
Other articles published on Dec 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X