Malti Chahar: అందమే అసూయ పడేలా ఉందే.. కుర్రాళ్ల మతులు పోగొడుతున్న దీపక్ చాహర్ అక్క!

హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ సోదరి మాలతి చాహర్ వివాదాస్ప వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తమ్ముడి వివావాహాన్ని ఫుల్ ఎంజాయ్ చేసిన మాలతి.. అతని హనీమూన్ గురించి బోల్డ్‌గా కామెంట్ చేసింది. దీపక్ చాహర్ ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్‌ను జూన్‌ 2న దీపక్ ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తమ్ముడు, మరదలికి విషెస్ చెప్పిన మాలతి.. అతని సెక్స్ లైఫ్ గురించి బాహటంగా మాట్లాడి విమర్శల పాలైంది.

నడుము జాగ్రత్త? అంటూ..

నడుము జాగ్రత్త? అంటూ..

కొత్త జంటతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆమె..'ఇప్పుడు ఈమె మా ఇంటిపిల్ల అయిపోయింది. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీకు దిష్టి తగలకూడదు. దీపక్ హనీమూన్‌లో నీ నడుము జాగ్రత్త. అసలే మనకు ప్రపంచకప్ ఉంది'అంటూ కొంటెగా ట్వీట్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు ఓ వర్గం నెటిజన్లకు నచ్చలేదు.

ఓ అక్క.. తమ్ముడి సెక్స్ లైఫ్ గురించి ఇలా బాహటంగా మాట్లాడటం సరికాదని వారు మండిపడ్డారు. మరీ ఇంత ఓవరాక్షన్‌ అవసరం లేదని, ఒక అక్కగా మీరు మాట్లాడే మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శించారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో మాలతి మరింత పాపులర్ అయింది.

మిస్సయిన మిస్ ఇండియా..

మిస్సయిన మిస్ ఇండియా..

నాన్ క్రికెట్ ఫ్యాన్స్ సైతం మాలతి కోసం నెట్టింట సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అసలు ఈమె ఎవరూ ఏం చేస్తున్నారంటూ ఆరాదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించిన మలతీ చాహార్.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. తమ్ముడు స్టార్ క్రికెటర్ అయినా.. సొంతంగా తన కెరీర్ నిర్మించుకోవాలనుకుంది. 2014లో మిస్ ఇండియా కిరిటాన్నీ తృటిలో చేజార్చుకొని రన్నరప్‌‌గా నిలిచింది.

ఐపీఎల్ మిస్టరీ గర్ల్‌గా..

ఐపీఎల్ మిస్టరీ గర్ల్‌గా..

దీపక్ చాహర్ సోదరి అయినప్పటికీ మాలతి ఐపీఎల్ మిస్టరీ గర్ల్‌గా అభిమానులకు పరిచయం అయింది. 2018 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌కు హాజరైన మాలతిని కెమెరామెన్ పదే పదే చూపించడంతో మిస్టరీ గర్ల్‌గా మారింది. ఉత్కంఠగా సాగిన నాటి మ్యాచ్‌లో ఆమె హవభావాలు అభిమానుల మనసులను దోచేసాయి. బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాంతో ఆమె ఎవరా? అని గూగులమ్మను ఆశ్రయించారు. అప్పుడే మాలతి చాహర్ అని, దీపక్ చాహర్ సోదరని ప్రపంచానికి తెలిసింది.

 డ్వేన్ బ్రావోతో డ్యాన్స్..

డ్వేన్ బ్రావోతో డ్యాన్స్..

ఆ వెంటనే సోదరుడు దీపక్ చాహర్,సీఎస్‌కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోతో కలిసి రన్ ది వరల్డ్ సాంగ్‌కు మాలతి చిందేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఐపీఎల్ 2018 సీజన్‌లో ధోనీతో కలిసి దిగిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. దాంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయింది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా..

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా..

గ్లామర్ వరల్డ్ రాక ముందు మాలతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. మోడలింగ్‌లోకి వచ్చిన తర్వాత కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో నటించింది. కొన్ని వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాల్లో కూడా కనిపించింది. డాబర్ రెడ్ టూత్ పేస్ట్, విశాక వీబోర్డ్, ఒస్సుమ్ బాడీ మిస్ట్ వంటి కంపెనీల ఉత్పత్పులకు సంబంధించి టీవీ యాడ్స్‌లో నటించింది. ఆమెకి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నాడురు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, June 6, 2022, 15:23 [IST]
Other articles published on Jun 6, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X