వార్నర్‌ను మిస్సయ్యాం: అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు

Posted By:
IPL 2018: David Warner Misses SunRisers Hyderabad Team, Send Message To Bhuvi
David Warner was batting so well, Sunrisers Hyderabad will miss him: Bhuvneshwar Kumar

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆ జట్టు పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ పేర్కొన్నాడు. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడటంతో డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌కు డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

ఐపీఎల్ 11వ సీజన్‌కు వార్నర్ దూరం కావడంతో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న భువనేశ్వర్‌ కుమార్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ 'ఈ ఏడాది ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌ను మిస్సయ్యాం. వార్నర్‌ ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తాడు. ప్రతి జట్టులో ఇలాంటి ఆటగాడు ఉండటం ఎంతో అవసరం. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా తన బాధ్యతను ఎంతో సమర్థంగా నిర్వహిస్తాడు' అని అన్నాడు.

వార్నర్ స్థానంలో అలెక్స్‌ హేల్స్‌‌

వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్‌ హేల్స్‌‌ను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయినా సరే వార్నర్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని భువీ తెలిపాడు. ఇక, డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై కూడా భువీ స్పందించాడు.

వార్నర్ స్థానంలో కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్

వార్నర్ స్థానంలో కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్

'వార్నర్‌ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న విలియమ్సన్‌ గత కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఎంతో సైలెంట్‌గా ఉంటూనే కెప్టెన్‌గా తన పని తాను చేసుకుపోతుంటాడు. గత ఏడాది సీజన్‌లో వార్నర్‌కు విలియమ్సన్‌ ఎంతో సాయం చేశారు. అతనిపై నమ్మకంతోనే యాజమాన్యం కెప్టెన్సీ అప్పగించింది' అని భువీ అన్నాడు.

బౌలింగ్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి

ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్‌లో తప్పక రాణిస్తుందని భువీ తెలిపాడు. 'అరంగేట్రం చేసినప్పటికీ ఇప్పటికీ నా బౌలింగ్‌లో చాలా మార్పులు చేసుకున్నాయి. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో. గత రెండేళ్లలో నా పేస్‌, స్వింగ్‌ చాలా మెరుగుపడింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది' అని భువీ అన్నాడు.

హైదరాబాద్‌కు వచ్చిన శిఖర్ ధావన్

ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ఓపెనర్ శిఖర్ ధావన్ మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో చేరాడు. ఆప్ఘన్ ప్లేయర్ రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ నబీ కూడా హైదరాబాద్‌ జట్టులో చేరారు. ఈ మేరకు శిఖర్ ధావన్, రషీద్‌ ఖాన్‌, నబీ హైదరాబాద్‌ చేరుకున్న విషయాన్ని సన్‌రైజర్స్‌ తన ట్విట్టర్‌లో పేర్కొంది.

రెండు రోజులుగా ప్రాక్టీస్‌ చేస్తోన్న సన్ రైజర్స్ ఆటగాళ్లు

ఉప్పల్‌ మైదానంలో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు గత రెండు రోజులుగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. సన్ రైజర్స్‌కు చెందిన ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. బుధవారం ఉదయం ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో మైదానానికి చేరుకున్నారు. జట్టు మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, ప్రధాన కోచ్‌ టామ్‌ మూడీ ఆధ్వర్యంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, April 4, 2018, 17:41 [IST]
Other articles published on Apr 4, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి