న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇప్పుడైనా బుద్దొచ్చిందా? డేవిడ్ వార్నర్ కాళ్లు పట్టుకొండి!

David Warner Fans Trolls SRH Management After Becoming Man Of The Tournament

హైదరాబాద్: 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్‌లో సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆడమ్ జంపా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ తమదైన ఆటతో చాంపియన్‌గా నిలబెట్టారు. ముఖ్యంగా వార్నర్ ఆట సంచలనం. మెగాటోర్నీ ముందు వరకు ఫామ్‌లో లేని వార్నర్.. అసలు సిసలు టోర్నీ‌లో సత్తా చాటాడు. 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 284 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.

ఇందులో (65, 89 నాటౌట్, 49, 53) నాలుగు విన్నింగ్ నాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా వెస్టిండీస్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో వార్నర్ ఆడిన తీరు.. సెమీస్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పయినా తీవ్ర ఒత్తిడిలో స్వేచ్చగా ఆడిన విధానం అతని కెరీర్‌లోనే హైలైటని చెప్పొచ్చు. ఇక వార్నర్ సూపర్ ఫామ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వార్నర్‌కు ఘోర అవమానం..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుదీర్ఘకాలం నుంచి ఆడుతున్న వార్నర్.. 2016‌లో ఆ జట్టుకు టైటిల్ కూడా అందించాడు. ప్రతీ సీజన్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన వార్నర్.. ఈ సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండు దశల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. దాంతో కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. చివరకు టీమ్ డగౌట్‌లోకి కూడా అతన్ని అనుమతించకుండా సన్‌రైజర్స్ అవమానించింది.

వార్నర్‌ స్థానంలో కేన్ విలియమ్సన్ సారథ్య బాధ్యతలు చేపట్టినా సన్‌రైజర్స్ తలరాత మాత్రం మారలేదు. సీజన్‌ను ఆ జట్టు ఆఖరి స్థానంతో ముగించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో డేవిడ్ వార్నర్‌ ఉంటాడా? లేదా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. వార్నర్ సైతం సన్‌రైజర్స్‌కు ఆడాలని ఉన్నా.. తనని రిటైన్ చేసుకుంటుందని అనుకోవడం లేదని చెప్పాడు.

కాళ్లు పట్టుకొండి..

అయితే టీ20 ప్రపంచకప్‌లో వార్నర్ తాజా ప్రదర్శనతో అతని అభిమానులు సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ అనేది టెంపరరనీ, క్లాస్ పర్మినెంటని చురకలంటిస్తున్నారు. టైటిల్ అందించిన ఆటగాడిని పక్కనపెట్టి అవమానపరిచారని, అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చుంటే రాణించేవాడని మండిపడుతున్నారు.

చెత్త టీమ్, పనికిరాని సపోర్ట్ స్టాఫ్‌తో వార్నర్‌పై ఒత్తిడి కలిగిందని, ఔటైతే ఆడేవారు లేరనే ఆందోళన అతని వైఫల్యానికి కారణమని ఫైర్ అవుతున్నారు. తప్పంతా టీమ్‌మేనేజ్‌మెంట్ దగ్గర పెట్టుకొని వార్నర్‌ను బలి చేశారని, ఇప్పటికైనా బుద్దితెచ్చుకోని అతన్ని రిటైన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కాళ్లు పట్టుకొని మరి సన్‌రైజర్స్‌కు ఆడేలా ఒప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

సపోర్ట్ స్టాఫ్‌ను మార్చేయండి..

వచ్చే సీజన్‌లో హైదరాబాద్ రాత మారాలంటే మార్చాల్సింది కెప్టెన్‌ను కాదని, సపోర్ట్ స్టాఫ్‌నని అభిమానులు సూచిస్తున్నారు. చెత్త మెంటార్, పనికిరాని కోచ్‌లు, సహాయక సిబ్బందితో లాభం లేదని, మెగా వేలానికి సరిగ్గా సిద్దమవ్వాలని సూచిస్తున్నారు. పూర్తిగా విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడకుండా దేశవాళీ స్టార్స్‌ను తీసుకోవాలని, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. వార్నర్, కేన్ విలియమ్సన్‌ను రిటైన్ చేసుకొని వారి సూచనలు, సలహాలతో టీమ్‌ ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఆరోన్ ఫించ్ సైతం..

ఇక మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్, విమర్శకులను ఉద్దేశించి అతను చేసిన పరోక్ష వ్యాఖ్యలు వారికి గుండెల్లో గుచ్చుకున్నాయి.'కొన్నాళ్ల క్రితం వార్నర్‌ను కొందరు లెక్కలోకి తీసుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. గొప్పగా ఆడుతున్నా.. వార్నర్‌ పనె పోయిందని ఎందుకు రాస్తున్నారో అర్థం కావడంలేదు. వారికి గట్టిగా సమాధానం చెప్పాలనుకున్నట్టే ఉంది అతడి ఆట.'అంటూ విమర్శకులపై ఫించ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

Story first published: Monday, November 15, 2021, 11:29 [IST]
Other articles published on Nov 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X