న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: మైదానంలో మరోసారి బుట్ట బొమ్మ స్టెప్ వేసిన డేవిడ్ వార్నర్ (వీడియో)

David Warner brings out Butta Bomma step while fielding in the first ODI against India

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు సూపర్ హిట్ 'బుట్ట బొమ్మ'సాంగ్ స్టెప్ వేసి ఆకట్టుకున్నాడు. భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఫస్ట్ వన్డేలో ఈ ఆసీస్ ఓపెనర్ మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ ఈ సిగ్నచర్ స్టెప్ వేసాడు. 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన ఈ మ్యాచ్‌లో కొందరూ వార్నర్ చిందెయడాన్ని తమ ఫోన్లతో వీడియో తీసి ట్వీట్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

కరోనా లాక్‌డౌన్‌లో తన టిక్‌టాక్ వీడియోలతో భారత అభిమానులను ఆకట్టుకున్న వార్నర్.. ముఖ్యంగా తెలుగు సినిమా పాటలకు చిందేస్తూ డైలాగ్స్ చెప్పాడు. ఇందులో వార్నర్‌కు బుట్టబొమ్మ సాంగ్ బాగా నచ్చింది. ఈ సాంగ్‌పై వార్నర్ ఇప్పటికే పలుమార్లు చిందేయగా.. వాటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సాంగ్ హీరో అల్లు అర్జున్ కూడా ట్విటర్ వేదికగా వార్నర్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అంతలా ఆకట్టుకున్నాడు వార్నర్.

ఈ ఫస్ట్ వన్డేలో కోహ్లీసేన 66 పరుగులతో చిత్తుగా ఓడింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆరోన్‌ ఫించ్‌ ( 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్‌లతో 114), స్టీవ్ స్మిత్‌ (66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్‌ వార్నర్‌ (76 బంతుల్లో 6ఫోర్లతో 69), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ (3/59) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్యా( 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90), శిఖర్ ధావన్(86 బంతుల్లో 10 ఫోర్లతో 74) రాణించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు, హజల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. స్టార్క్ ఓ వికెట్ తీశాడు.

రికార్డుల రారాజు కోహ్లీకి ఏమైంది? గత 22 ఇన్నింగ్స్‌లుగా ఒక్క సెంచరీ లేదు!రికార్డుల రారాజు కోహ్లీకి ఏమైంది? గత 22 ఇన్నింగ్స్‌లుగా ఒక్క సెంచరీ లేదు!

Story first published: Friday, November 27, 2020, 20:57 [IST]
Other articles published on Nov 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X