న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘కర్రోడా’అని పిలిచిన వ్యక్తి నాతో మాట్లాడాడు: సామీ

Darren Sammy gets a call from one of his ex-SRH teammates

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా తాను జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2013, 2014 సీజన్లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్‌ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు. సహచర ఆటగాళ్లంతా తనని కాలూ(నల్లోడా) అని పిలిచేవారని అప్పట్లో దాని అర్థం తనకు తెలియదే.. ఈ మధ్యే ఆ పదం మీనింగ్ తెలుసుకొని చాలా బాధపడ్డానని తెలిపాడు.

అంతేకాకుండా తనను అలా పిలిచిన ఆటగాళ్లంతా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. తనను కర్రోడా అని పిలిచిన వారంతా తనతో ఫోన్, ట్విటర్, ఫేస్‌బుక్ ఏదో మాధ్యమం ద్వారా మాట్లాడి వివరణ ఇవ్వాలని కోరాడు.

నా బ్రదర్ భరోసా ఇచ్చాడు..

నా బ్రదర్ భరోసా ఇచ్చాడు..

తాజాగా సన్‌రైజర్స్ తరఫున ఆడిన ఓ ఆటగాడు ఈ వ్యవహారంపై తనతో మాట్లాడాడని సామీ ట్వీట్ చేశాడు. తనపై ఉన్న ప్రేమతోనే అలా పిలిచాడని, వివక్షతో కాదని భరోసా ఇచ్చాడని పేర్కొన్నాడు.

’నన్ను ‘కాలూ’ అని పిలిచిన అప్పటి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ఆటగాడు ఒకరు నాతో మాట్లాడాడు. ఈ విషయం చెప్పడానికి సంతోషంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వర్ణ వివక్షపై దుష్ప్రచారలను అపేసి అందరికి అవగాహన కల్పించాలనుకున్నాం. అప్పుడు ప్రేమతోనే అలా పిలిచానని నా బ్రదర్ నాకు భరోసా ఇచ్చాడు. నేను అతణ్ని పూర్తిగా నమ్ముతున్నాను' అని సామీ ట్విట్టర్‌‌లో పేర్కొన్నాడు.

ప్రయోగాలు చేయడానికి మేమేమీ పందులం కాదు: వెస్టిండీస్ కెప్టెన్

అప్పట్లో ఇషాంత్ ఇన్‌స్టా పోస్ట్..

అప్పట్లో ఇషాంత్ ఇన్‌స్టా పోస్ట్..

అయితే సామీ వర్ణ వివక్షకు గురైన విషయం తమకు తెలియదని నాటి ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, పార్ధీవ్ పటేల్, వేణుగోపాల్ రావు తెలిపారు. అయితే 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడైన ఇషాంత్ శర్మ.. సామీని 'కాలు' అని పిలుస్తూ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అయింది. అప్పటి సన్‌రైజర్స్ జట్టు సభ్యులు భువనేశ్వర్, స్టెయిన్‌లతో పాటు సామీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన ఇషాంత్ 'నేను, భువి, కాలూ, గన్' అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్ అవుతుండడంతో నెటిజన్లు ఇషాంత్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. సామీ చెప్పిన మాటలు నిజమేనని అభిప్రాయపడుతున్నారు.

ఇక సామీ కూడా తనకు కాలు అనే నిక్‌నేమ్ సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్ ఇచ్చినట్లు ట్వీట్ చేశాడు. 2014లో లక్ష్మణ్ బర్త్‌డే సందర్బంగా అతనికి విషేస్ తెలియజేస్తూ.. తనకు కాలూ అనే నిక్ నేమ్ పెట్టారనే విషయాన్ని ప్రస్తావించాడు.

సామీ బ్రో.. కాలు అంటే అదే కాదు..

సామీ బ్రో.. కాలు అంటే అదే కాదు..

ఇక ‘కాలు'అనేది ఎల్లప్పుడూ జాత్యాహంకార పదం కాదని ఓ ట్విటర్ యూజర్ తెలిపాడు. ‘డారెన్​ సామీ బ్రో.. మీకు ఓ విషయం తెలుసా!!. 'కాలూ' ఎల్లప్పుడూ జాత్యాంహకార పదం కాదు. భారతీయ కుటుంబాలలో ఈ పదాన్ని ముద్దుగా కూడా వాడుతారు. నా దివంగత బామ్మ కూడా నన్ను 'కాలూ' అని ముద్దుగా పిలిచేవారు. అయితే ఇది పిలిచే సందర్భంపై ఆధారపడి ఉంటుంది. వర్ణ వివక్షను కూడా తెలియచ్చు. కానీ ఎల్లప్పుడూ అదే అర్థం రాదు' అని తెలిపాడు. దీనిపై సమీ స్పందించిన సామీ.. ‘నువ్వు చెప్పేది నిజమే కావొచ్చు.. కానీ నాకు మాత్రం అలా అనిపించడం లేదు' అని బదులిచ్చాడు.

ఒక్క బంతికే 17 పరుగులు.. పాక్‌పై సెహ్వాగ్ అరుదైన రికార్డు!

Story first published: Friday, June 12, 2020, 20:50 [IST]
Other articles published on Jun 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X