Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క బంతికే 17 పరుగులు.. పాక్‌పై సెహ్వాగ్ అరుదైన రికార్డు!

Virender Sehwag hits 17 runs off 1 ball against Pakistan

హైదరాబాద్: భయానికే మీనింగ్‌ తెలియని క్రికెటర్‌..! ఓపెనర్‌ అంటే ఇలానే ఆడాలని కొత్త నిర్వచనం చెప్పిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌.! సెంచరీ చెరువలో ఉన్నా బంతిని బౌండరీకి తరలించే సాహసి.! ప్రతీ బంతిని బాది ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా భావించే త్రిశతక వీరుడు.! అతడే భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.!

సెహ్వాగే మా సింహ స్వప్నం..

సెహ్వాగే మా సింహ స్వప్నం..

‘బంతిని చూడటం.. బాదడం'అనే ఫార్మూలాని సింపుల్‌గా ఫాలో అయిపోయాడు. ఫార్మాట్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. చివరికి మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా సెహ్వాగ్ దూకుడు మాత్రం ఆగేది కాదు. దాయదీ పాకిస్థాన్ అంటే రెచ్చిపోయేవాడు. ముఖ్యంగా 2003-04 పాక్ పర్యటనలో తన విధ్వంసకర ఆటతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. ఎంతలా అంటే అప్పటి పాక్ కెప్టెన్ ఇంజుమామ్ ఉల్ హక్.. సెహ్వాగే మా సింహ స్వప్నం అనే చెప్పేలా చెలరేగాడు.

ఒక బంతికి 17 పరుగులు..

ఒక బంతికి 17 పరుగులు..

అలా తన అద్వితీయమైన ఆట తీరుతో ఆ సుదీర్ఘ పర్యటనలో అద్భుత రికార్డులు నెలకొల్పాడు. అందులో ఇప్పటికీ చెక్కు చెదరనీ.. మరేవరూ సాధించని.. ఇంకెవరూ అందుకోలేని రికార్డు.. ‘ఒక బంతికి 17 పరుగులు'. అవును.. బౌలర్ అసమర్థతను అందిపుచ్చుకున్న వీరూ ఒక బంతికే 17 పరుగులు పిండుకొని క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అరుదైన ఘనతను సెహ్వాగ్ అందుకోగా.. అతని విధ్వంసానికి బలైంది మాత్రం పాకిస్థాన్ మాజీ పేసర్ రాణా నవీద్ ఉల్ హసన్. ఓ బౌలర్‌గా అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

జడ్డూ నీతో వచ్చే సమస్యే ఇది.. ఔట్ అంటావ్ రివ్యూ తీసుకున్నాక డౌట్ అంటావ్: కోహ్లీ

ఐదు నోబాల్స్..

ఐదు నోబాల్స్..

2003-04 పాక్ పర్యటనలో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా జరిగిన తొలి వన్డేలోనే ఈ సూపర్ రికార్డు నమోదైంది. భారత్ ఇన్నింగ్స్ 11 ఓవర్లో రాణా నవీద్ ఉల్ హసన్ వరుసగా ఐదు నో బాల్స్ వేయగా సెహ్వాగ్ మూడింటిని బౌండరీకి తరలించాడు. దీంతో ఒక్క బంతికి అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డుతో పాటు.. అత్యధిక నోబాల్స్ వేసిన బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.

తొలి బంతి డాట్ చేసిన నవీద్.. 4nb, 4nb, 0nb, 4nb, 0nb తర్వాత ఐదు నోబాల్స్‌ వేయగా.. అందులో సెహ్వాగ్ మూడు బౌండరీలు బాదాడు. దీంతో ఒక్క బంతికే 17 పరుగులు వచ్చాయి. అనంతరం మరో బౌండరీ బాదిన సెహ్వాగ్.. ఆ ఓవర్‌లో మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు. ఇందులో రెండు బంతులకే 21 పరుగులు వచ్చాయి.

భారత్ ఉత్కంఠకర విజయం..

భారత్ ఉత్కంఠకర విజయం..

ఆధ్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత్ 5 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(57 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 79), రాహుల్ ద్రవిడ్ (104 బంతుల్లో 8 ఫోర్లు 99) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 349 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య పాకిస్థాన్.. కెప్టెన్ ఇంజుమామ్ ఉల్ హక్( 102 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 122) సెంచరీకి తోడు మహ్మద్ యూసఫ్( 68 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్‌లు 73) రాణించడంతో గెలిచేంత పని చేసింది.

కానీ భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయలేక ఓటమికి తలొంచింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 344 పరుగులే చేసి.. 5 పరుగులతో ఓటమిపాలైంది. ఇక ఈ సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది.

కరోనా కారణంగా ప్రస్తుతం క్రికెట్ టోర్నీలన్నీ నిలిచిపోవడంతో.. అభిమానులు భారత క్రికెట్‌లోని మధుర క్షణాలును నెమరవేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్ ఒక్క బంతి 17 పరుగుల రికార్డుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

129 పరుగులకే 7 వికెట్లు.. ఓడాల్సిన వన్డేలో 2 వికెట్లతో గెలిచిన భారత్!

Story first published: Friday, June 12, 2020, 15:32 [IST]
Other articles published on Jun 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+