న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ బలమైన జట్టును ఎంచుకున్నా.. ఒక్క స్పిన్నర్ కూడా లేకపోవడం పెద్ద లోటే: కనేరియా

Danish Kaneria said India face problems in WTC Final and England series with Absence Of Wrist Spinner

కరాచీ: న్యూజిలాండ్‌తో జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌, ఇంగ్లండ్‌ సిరీస్ కోసం టీమిండియా బలమైన జట్టును ఎంచుకున్నా.. ఒక్క మణికట్టు స్పిన్నర్‌ను కూడా ఎంపిక చేసుకోకపోవడం పెద్ద లోటే అని పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలో అగ్ర జట్టు అయిన టీమిండియా ఈ చిన్న ట్రిక్‌ను ఎలా మిస్ అయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ శుక్రవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 20 మంది ప్రాబబుల్స్‌తో పాటు నలుగురిని స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా ఎంపిక చేసింది.

బలమైన జట్టును ఎంచుకున్నా

బలమైన జట్టును ఎంచుకున్నా

తాజాగా డానిష్ కనేరియా మాట్లాడుతూ... 'టెస్టు చాంపియన్‌షిప్‌, ఇంగ్లండ్‌ సిరీస్ కోసం టీమిండియా బలమైన జట్టును ఎన్నుకుంది. జట్టు చాలా బాగుంది. అయితే ఒక్క మణికట్టు స్పిన్నర్‌ను కూడా ఎన్నుకోలేదు. రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ రూపంలో నలుగురు స్పిన్నర్లు జట్టులో ఉన్నా.. వారంతా ఫింగర్‌ స్పిన్నర్లు. ఒక లెగ్ స్పిన్నర్ కూడా లేడు. ఇది కచ్చితంగా కోహ్లీసేనకు పెద్ద లోటనే చెప్పాలి. ఎందుకంటే లెగ్ బ్రేక్ బౌలర్లకు ఇంగ్లండ్ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి' అని అన్నాడు. కనేరియా ఇంగ్లీష్ కౌంటీల్లో ఎసెక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

టీమిండియాకు కచ్చితంగా తెలుస్తుంది

టీమిండియాకు కచ్చితంగా తెలుస్తుంది

'నేను ఇంగ్లండ్‌లో ఎనిమిది సంవత్సరాల కౌంటీ క్రికెట్‌ ఆడాను. వివిధ పరిస్థితులలో ఆడడంతో ఎంతో అనుభవం వచ్చింది. సీజన్ ప్రారంభమైనప్పుడు ఒకలా, టోర్నీ సాగుతున్నా కొద్ది మరోలా పిచ్‌లు ఉంటాయి. అక్కడ మంచు ప్రభావం కూడా ఉంటుంది. సీమ్ పరిస్థితులు ఉన్నచోట లెగ్ స్పిన్నర్ జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాడు. అందుకే నేను కౌంటీ క్రికెట్ ఆడినప్పుడు విజయవంతం అయ్యా. అక్కడి పరిస్థితులలో ఫింగర్ స్పిన్నర్ కన్నా.. మణికట్టు స్పిన్నర్ జట్టుపై ప్రభావం చూపుతాడు. అందుకే లెగ్ స్పిన్నర్ లేని లోటు టీమిండియాకు కచ్చితంగా తెలుస్తుంది' అని డానిష్ కనేరియా తెలిపాడు.

India vs Sri Lanka: లంక టూర్ నుంచి శ్రేయాస్ అయ్యర్ ఔట్.. ధావన్‌కు లైన్ క్లియర్! ఇదే మొదటిసారి!

రాహుల్ చహర్ ఉన్నా బాగుండేది:

రాహుల్ చహర్ ఉన్నా బాగుండేది:

టీమిండియా, ముంబై ఇండియన్స్ జట్లకు ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న స్పిన్నర్ రాహుల్ చహర్ జట్టులో ఉండిఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా. చహర్ ఎత్తు, అతను బంతిని విడిచే విధానం టీమిండియాకు కలిసొచ్చేదన్నాడు.

ఇష్ సోధి, ఆడమ్ జాంపాలా చహర్ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించేవాడన్నాడు. చహర్‌ టెస్ట్ క్రికెట్ ఆడగలడని కనేరియా చెప్పుకొచ్చాడు. 2000లో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్‌‌లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎలాంటి కారణం లేకుండానే పీసీబీ కనేరియాను జట్టు నుంచి తప్పించింది. ఆపై స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి జట్టుకు దూరమయ్యాడు.

ఆకాశ్ చోప్రా కూడా

ఆకాశ్ చోప్రా కూడా

జట్టులో ఒక్క మణికట్టు స్పిన్నర్‌ లేకపోవడం తనను ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కూడా టీజగా అన్నాడు. 'ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. కానీ వారంతా ఫింగర్‌ స్పిన్నర్లు. మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇబ్బందిపడే ప్రత్యర్థి ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు తీసుకోకూడదు. బీసీసీఐ సెలెక్టర్లు ఓసారి ఆలోచించండి' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

Story first published: Wednesday, May 12, 2021, 13:36 [IST]
Other articles published on May 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X