న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అర్జున్‌ టెండూల్కర్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టం: మహిళా క్రికెటర్‌

Danielle Wyatt reveals her experience of facing Arjun Tendulkar

లండన్‌: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టం అని ఇంగ్లండ్‌ మహిళల క్రికెటర్‌ డానియల్‌ వ్యాట్‌ పేర్కొన్నారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ వారసుడైన అర్జున్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగే​ట్రం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాదిలో ఎక్కువ నెలలు ఇంగ్లండ్‌లో గడుపుతూ అంతర్జాతీయ ఆరంగేట్రం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

అంతర్జాతీయ ఆటగాళ్లకు బౌలింగ్

అంతర్జాతీయ ఆటగాళ్లకు బౌలింగ్

అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ లేదా లిస్ట్-ఎ క్రికెట్ ఆడకపోవచ్చు కానీ అతనికి భారత జట్టు, ఇంగ్లండ్‌ జట్టు మరియు ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. జూనియర్ సచిన్ ఇంగ్లండ్‌కు ఎప్పుడూ వెళుతుంటాడు. అర్జున్ అక్కడ అంతర్జాతీయ ఆటగాళ్లకు తరచూ బౌలింగ్ చేస్తుంటాడు. 2017 ప్రపంచకప్ ఫైనల్‌కు ముందే భారత మహిళా జట్టుకు బౌలింగ్ చేసిన నెట్ బౌలర్లలో అర్జున్ కూడా ఒకడు. ఈ క్రమంలోనే మహిళల క్రికెటర్‌ డానియల్‌ వ్యాట్‌ కూడా అర్జున్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు.

అర్జున్‌ భయపెట్టేవాడు

అర్జున్‌ భయపెట్టేవాడు

ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌ డానియల్‌ వ్యాట్‌, అర్జున్ టెండూల్కర్‌లు మంచి స్నేహితులు అనే విషయం అందిరికీ తెలిసిందే. అయితే అర్జున్‌ బౌలింగ్‌ గురించి వ్యాట్‌​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అర్జున్‌, నేను మంచి స్నేహితులం. లార్డ్స్‌ మైదానానికి ప్రాక్టీస్‌ చేయడానికి అతడు వస్తుండేవాడు. అప్పుడు కొత్త బంతితో నాకు బౌలింగ్‌ చేయాలని అడిగితే అర్జున్‌ భయపెట్టేవాడు. నేను వేసే బౌన్సర్లు నీ తలకు తగులుతాయి అని హెచ్చరించేవాడు. దీంతో అతడి బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు ఇష్టపడను. అంతేకాకుండా అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం' అని అన్నాడు.

ఆటగాడిగా మెరుగవుతున్నాడు

ఆటగాడిగా మెరుగవుతున్నాడు

'అర్జున్ ఓ ఆటగాడిగా మెరుగవుతున్నాడు. త్వరలోనే అంతర్జాతయ క్రికెట్‌లో అతడిని చూసే అవకాశం ఉంది. ఇక అర్జున్‌ వాళ్ల అమ్మ అంజలితో తరుచూ మాట్లాడతా. చాలా మంచి వ్యక్తి. సచిన్‌, అంజలిలు ఇంగ్లండ్‌కు వచ్చిన ప్రతీసారి వారిని కలుస్తాను' అని డానియల్‌ వ్యాట్‌ చెప్పారు. ఇక మహిళల ప్రపంచకప్‌ 2017 గెలిచిన ఇంగ్లండ్‌ జట్టలో వ్యాట్‌ కీలక ప్లేయర్‌ అన్న విషయం తెలిసిందే. ఇం​గ్లండ్‌ తరుపును ఆమె ఇప్పటివరకు 74 వన్డేలు, 109 టీ20లకు ప్రాతినిథ్యం వహించారు.

సచిన్ కుమారుడు కావడంతో:

సచిన్ కుమారుడు కావడంతో:

ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్.. ఇప్పటి వరకూ అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్‌ ఆడలేదు. కానీ తరచూ మీడియాలో అతని పేరు వినిపిస్తూనే ఉంది. సచిన్ టెండూల్కర్ కుమారుడు కావడంతో ప్రస్తుతం మైదానంలో అర్జున్ ప్రదర్శన కంటే.. జట్టులోకి అతని ఎంపికపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. సచిన్ కొడుకు కావడంతోనే జట్టులోకి ఎంపికవుతున్నాడని ఒక వర్గం అంటుంటే.. అర్జున్ కారణంగా కొందరు ప్రతిభ ఉన్న క్రికెటర్లు మరుగునపడుతున్నారనే విమర్శలు మరో వర్గం ద్వారా వినిపిస్తున్నాయి.

హర్భజన్‌ హ్యాట్రిక్‌తో మరింత విశ్వాసం పెరిగింది: లక్ష్మణ్‌

Story first published: Wednesday, June 17, 2020, 14:10 [IST]
Other articles published on Jun 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X