న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారెవ్వా క్రిస్టియన్.. వాటే క్యాచ్! అచ్చం చేప పిల్లలానే దూకేసావ్!

 Daniel Christian Takes A Stunning Catch At Mid-On To Get Rid Of Shubman Gill

చెన్నై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వైదానంలోకి వచ్చిన క్రిస్టియన్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. అచ్చం చేప పిల్లలా డైవ్ చేసి అతను అందుకున్న క్యాచ్‌కు మైదానంలోని ఆటగాల్లతో పాటు కామెంటేటర్లు, టీవీల ముందున్న ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. వాటే క్యాచ్ అంటూ నోరెళ్ల బెట్టారు.

కైల్ జేమీసన్ వేసిన ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్‌లో కేకేఆర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుస సిక్సర్లతో చెలరేగాడు. ఆ ఓవర్ తొలి బంతినే కవర్స్ మీదుగా బౌండరీ కొట్టిన గిల్.. సెకండ్ బంతిని వదిలేసి.. మూడో బంతిని మిడివికెట్ మీదుగా సిక్సర్ తరలించాడు. ఆ మరుసటి బంతి ఓవర్ పాయింట్ దిశగా మరో సిక్సర్ కొట్టాడు. అదే ఊపులో జేమీసన్ వేసిన మరుసటి స్లోయర్ బాల్‌ను భారీ షాట్‌కు యత్నించగా.. బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి మిడాన్‌ దిశగా వెళ్లింది.

అయితే అప్పటికే అక్కడ వేచివున్న సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ క్రిస్టియన్‌ ఒకవైపు డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దాంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది. చివరకు ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 38 పరుగులతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్నందుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 రన్స్ చేసింది. గ్లేన్ మ్యాక్స్ వెల్(49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78), ఏబీ డివిలియర్స్(34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా.. కమిన్స్, ప్రసిధ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆండ్రూ రస్సెల్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), ఇయాన్ మోర్గాన్( 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ధాటిగా ఆడేక్రమంలో కేకేఆర్ బ్యాట్స్‌మెన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. ఆర్‌సీబీ బౌలర్లలో కైల్ జెమీసన్ మూడు, చాహల్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. సుంధర్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది.

Story first published: Sunday, April 18, 2021, 19:51 [IST]
Other articles published on Apr 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X