న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రేక్షకులకు భయపడి అంపైర్ ఔటివ్వలేదు.. లేకుంటే సచిన్ డబుల్ సెంచరీ చేసేవాడు కాదు: స్టెయిన్

Dale Steyn Says Got Sachin Tendulkar out in 190s, but umpire turned it down fearing the crowd

కేప్‌టౌన్: క్రికెట్ చరిత్రలో ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్.. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ ఘనతను కూడా తన పేరిటనే లిఖించుకున్నాడు. 2010లో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ ఈ ఫీట్‌ను అందుకొని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బూరపరిచాడు. అయితే తాజాగా ఈ డబుల్ సెంచరీపై సౌతాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్‌లో సఫారీ జట్టులో ప్రధాన బౌలర్ అయిన స్టెయిన్ అంపైర్ భయపడటం వల్లనే సచిన్.. డబుల్ సెంచరీ సాధించాడని ఆరోపించాడు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేసిన స్టెయిన్ సంచలన విషయాలు వెల్లడించాడు.

ప్రేక్షకులకు అంపైర్ భయపడ్డాడు..

ప్రేక్షకులకు అంపైర్ భయపడ్డాడు..

గ్వాలియర్(మధ్యప్రదేశ్) వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షక సమూహాన్ని చూసి భయపడ్డాడని తెలిపాడు. దాంతో సచిన్ 190 ప్లస్ పరుగుల వద్ద ఉన్నప్పుడు తాను ఎల్బీడబ్ల్యూ చేశానని, కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. తనకు ఏమీ అర్థంకాక గౌల్డ్ వైపు చూశానని, అతడి మొఖంలో భయం కనపడిందని స్టెయిన్ చెప్పాడు.

 హోటల్‌కు కూడా వెళ్లనివ్వరు..

హోటల్‌కు కూడా వెళ్లనివ్వరు..

‘నేనేమో.. ఇదేం నిర్ణయం.. అవుట్ అయ్యాడు కదా.. నాట్ ఔట్ ఎందుకిచ్చావు? అనే ఉద్దేశంతో అతడి వైపు చూశా. అంపైరేమో.. చుట్టూ జనాలను చూశావా.. సచిన్‌ను ఔట్ ఇస్తే ఇక్కడి నుంచి హోటల్‌కు కూడా నన్ను వెళ్లనివ్వరు.. అనేలా నా వైపు దీనంగా చూశాడు' అని స్టెయిన్ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ 147 బంతుల్లో 200 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ 401 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. తరువాత ఛేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 153 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

అదే బెస్ట్ స్పెల్..

అదే బెస్ట్ స్పెల్..

టెండూల్కర్ తన చివరి 51వ టెస్ట్ సెంచరీని కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు. ముఖ్యంగా టెయిలండర్స్ సాయంతో స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ఈ శతకాన్ని అందుకున్నాడు. దీంతో ఇది తన కెరీర్‌లో ఎదుర్కొన్న బెస్ట్ స్పెల్ అని సచిన్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఇక టెండూల్కర్ బౌలింగ్ ఎలా చేయాలో.. ముఖ్యంగా భారత ప్రేక్షకుల ముందు

అతన్ని ఎదుర్కున్న తీరును స్టెయిన్ వివరించాడు. ‘సచిన్ అద్భుత బ్యాట్స్‌మన్.. అతను చాలా అరుదుగా వికెట్ల ముందు దొరుకుతాడు'అని తెలిపాడు.

ఒక్క చెత్త బంతి వేసినా..

ఒక్క చెత్త బంతి వేసినా..

ఇక ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ మాట్లాడుతూ.. సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పు చేయవద్దని, ముఖ్యంగా బౌలింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ‘ఒక్క చెత్త బంతిని కూడా సచిన్‌కు వేయకూడదు. ముఖ్యంగా భారత్‌లో అలాంటి తప్పిదం చేయవద్దు. ఆ ఒక్క బంతిని బౌండరీ తరలించే తన ఆటను మొదలు పెడతాడు. దాన్ని అలానే కొనసాగిస్తూ 500 పరుగులైనా చేస్తాడు. అప్పుడు ప్రపంచం మొత్తం ముగిసిపోతుందనే ఫీలింగ్ కలుగుతోంది. సానుకూల దృక్పథంతోనే బంతులు సంధించాలి'అని జిమ్మీ చెప్పుకొచ్చాడు.

రోహిత్ భాయ్.. తిట్టని తిట్టూ తిట్టారు: బంగ్లాదేశ్ క్రికెటర్

Story first published: Sunday, May 17, 2020, 10:13 [IST]
Other articles published on May 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X