కోల్ కతా జట్టు అరుదైన ఘనత: ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి

Posted By:
CSK pin hopes on Dhoni, Billings in 203 chase

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) అరుదైన ఘనత సాధించింది. మంగళవారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా వంద పరుగుల లోపే ఐదు వికెట్లు కోల్పోయి రెండొందల మార్కును చేరడంతో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. దీంతో ఐపీఎల్‌లో ఒక జట్టు వంద పరుగుల లోపే ఐదు వికెట్లు కోల్పోయి రెండొందల పరుగులకు పైగా చేయడం ఇదే తొలిసారి.

అంతకుముందు 2008లో డెక్కన్‌ చార్జర్స్‌ 95 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి చివరకు 181 పరుగులు చేసింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్‌ చార్జర్స్‌ ఆ ఘనత సాధించింది. ఆ తర్వాత 2015 సీజన్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 81 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.

కాగా, ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆండ్రూ రసెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా జట్టు చెన్నైకి 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఓపెనర్ సునీల్ నరైన్ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలి ఓవర్‌లోనే కోల్‌కతా 18 పరుగులు రాబట్టింది. అయితే భజ్జీ వేసిన రెండో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన నరైన్.. సురేశ్ రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరవాత మరో ఓపెనర్ లిన్, ఉతప్ప కలసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అయితే జడేజా వేసిన ఐదో ఓవర్‌లో లిన్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరవాత షేన్ వాట్సన్ వేసిన 9వ ఓవర్‌లో నితీష్ రానా(16) ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే ఓవర్‌లో సురేష్ రైనా విసిరిన సూపర్ త్రోకు రాబిన్ ఉతప్ప (29) రనౌటయ్యాడు. ఆ తర్వాత బ్రావో అద్భుత క్యాచ్‌తో రింకు సింగ్ (2) పెవిలియన్‌కు చేరాడు.

మరోవైపు మిడిలార్డర్‌లో వచ్చిన ఆండ్రూ రసెల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అదే ఓవర్‌లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ కూడా ఔటయ్యాడు. చెన్నై బౌలర్లలో షేన్ వాట్సన్‌ రెండు వికెట్లు తీయగా... హర్భజన్ సింగ్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 10, 2018, 23:35 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి