న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'3-4 బౌలర్లను పరిశీలిస్తున్నా.. ఆయన లోటును భర్తీ చేయడం సీఎస్‌కేకు అంత తేలిక కాదు'

CSK: Irfan Pathan reacts after Harbhajan Singhs IPL 2020 exit

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ లేని లోటును భర్తీ చేయడం చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)కు అంత తేలిక కాదని టీమిండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. భజ్జీ లేని లోటును భర్తీ చేయడానికి సీఎస్‌కే అన్ని విధాలా ప్రయత్నిస్తోందన్నారు. ఇక సీఎస్‌కే స్టార్ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా మళ్లీ జట్టుతో కలిసే అవకాశాలున్నాయని ఇర్ఫాన్‌ చెప్పాడు. వ్యక్తిగత కారణాలతో సీఎస్‌కే జట్టుకు చెందిన రైనా, హర్భజన్‌ ఇద్దరూ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

హర్భజన్‌ లోటును భర్తీ చేయడం కష్టమే

హర్భజన్‌ లోటును భర్తీ చేయడం కష్టమే

తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'హర్భజన్‌ సింగ్‌ లేని లోటును భర్తీ చేయడానికి సీఎస్‌కే అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఆ విషయంపై నాకు సమాచారం కూడా ఉంది. అందుకోసం ముగ్గురు, నలుగురు బౌలర్లను పరిశీలిస్తున్నారు. అయితే అదంత తేలికైన పని కాదు. దేశవాళీ క్రికెట్‌లో నాణ్యమైన ఆఫ్‌ స్పిన్నర్లు లేరు. హర్భజన్‌కు ముఖ్యంగా లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌పై ఆడిన అనుభవం ఉంది. వాళ్లపై మంచి ఆధిపత్యం చెలాయిస్తాడు. కొత్త బంతితో మాయ చేయగలడు. పవర్‌ ప్లేలోనూ నమ్మకమైన బౌలర్‌. కాబట్టి అతడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే' అని ఇర్ఫాన్‌ అన్నాడు.

రైనా ఆడితే చూడాలనుంది

రైనా ఆడితే చూడాలనుంది

ప్రస్తుతం సురేశ్‌ రైనా భారత్‌కు తిరిగి వచ్చినా.. ఒక్కసారి అతడి కుటుంబ పరిస్థితులు మెరుగు పడితే మళ్లీ దుబాయ్‌ ఫ్లైట్‌ ఎక్కే అవకాశం ఉందని ఇర్ఫాన్‌ పఠాన్‌ చెప్పాడు. తనకు కూడా రైనా ఆడితే చూడాలని ఉందన్నాడు. రైనా, హర్భజన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కీలకమైన ఆటగాళ్లు. ఇప్పటికే వీరిద్దరూ మెగా టోర్నీలో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. రైనా ఇప్పటికే ఐపీఎల్‌లో విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతుండగా.. హర్భజన్‌ అత్యధిక వికెట్ల వీరుడిగా మూడో స్థానంలో ఉన్నాడు.

ఫ్యామిలీతో గ‌డ‌పాల‌నే

ఫ్యామిలీతో గ‌డ‌పాల‌నే

ఐపీఎల్ 2020 కోసం దుబాయ్ వెళ్లిన సీఎస్‌కే జ‌ట్టులోని 13 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్లేయర్లు దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ సహా ఆ టీమ్‌లోని 11 మంది స్టాఫ్ కరోనా వైరస్ బారినడ్డారు. దీంతో క‌రోనా భ‌యంతోనే హ‌ర్భ‌జ‌న్ చెన్నై జ‌ట్టుకు దూరంగా ఉన్నాడంటూ కొంత‌మంది ఆరోపించారు. దీనిపై హ‌ర్భ‌జ‌న్ స్నేహితుడొక‌రు స్పందిస్తూ.. ఓ క్లారిటీ ఇచ్చాడు. 'కేవ‌లం వ్య‌క్తిగ‌త కార‌ణాలతోనే సింగ్ ఐపీఎల్ 2020‌లో పాల్గొన‌డం లేదు. అంతేకానీ దుబాయ్‌లో ఉన్న ప‌రిస్థితులు దృశ్యా అత‌ను దూర‌మ‌వ‌లేదు. త‌ల్లి అనారోగ్యం దృష్యా ఫ్యామిలీతో గ‌డ‌పాల‌నే నిర్ణ‌యంతో గ‌త మూడు నెల‌లుగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇది అందరూ అర్ధం చేసుకోండి. అంతేకాని అవాస్తవాలను ప్రచారం చేయొద్దు' అని హ‌ర్భ‌జ‌న్ స్నేహితుడు కోరారు.

 ఈ సీజన్ కష్టంగానే

ఈ సీజన్ కష్టంగానే

వాస్తవానికి ఐపీఎల్ 2020 చెన్నైకు కష్టంగానే ఉండనుంది. ఇప్పటికే సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్ రైనా జట్టుకు దూరమయ్యాడు. దుబాయ్‌ నుంచి భారత్‌కు వచ్చేశాడు. హ‌ర్భ‌జ‌న్ ఆడడం లేదు. భజ్జీ ఉండుంటే పియూష్‌ చావ్లా, ఇమ్రాన్‌ తాహిర్‌, మిచెల్‌ శాంట్నర్‌కు భారం తగ్గేది. సీనియర్లు లేకపోవడంతో ఉన్న కొద్ది మంది ఆటగాళ్లపైనే భారం ఎక్కువగా పడనుంది. యూఏఈలోని వేడి, ఉక్కపోతను తట్టుకుంటూ విరామం లేకుండా మ్యాచులు ఆడటం కాస్త సవాలే.

కరోనా ఉన్నా లేకున్నా.. షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్‌!!

Story first published: Monday, September 7, 2020, 15:41 [IST]
Other articles published on Sep 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X