న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమ్మను వదిలి ఉండ‌లేక‌పోయావా.. ఇర్ఫాన్ ఖాన్ మృతిపై క్రీడాలోకం దిగ్భ్రాంతి

Cricketing fraternity pays tribute to Irrfan Khan after his demise
#IrrfanKhan : Indian Cricketers Pay Tribute To Irrfan Khan

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసింది. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ షమీ, కైఫ్, సురేశ్ రైనా తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.

54 ఏళ్ల ఇర్ఫాన్ 2018 నుంచి న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్​తో అనే వ్యాధితో ఇబ్బందిప‌డుతున్నారు. లండన్‌లో చికిత్స తీసుకుని ఇటీవల భారత్‌కు వచ్చారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు.

మా హృదయాలను తాకింది..

‘ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త బాధను కలిగించింది. ఆయన విలక్షన నటన, టాలెంట్ ప్రతీ ఒక్కరి హృదయాలను తాకింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను'- విరాట్ కోహ్లీ

నా ఫేవరేట్ హీరో

‘ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త వినడం విచారకరంగా ఉంది. నా అభిమాన నట్టుల్లో ఆయన ఒకరు. ఇర్ఫాన్ చివరగా నటించిన అంగ్రేజి మీడియంతో సహా అన్నీ సినిమాలు చూశాను. ఆయనకు నటన చాలా సహజంగా ఉండేది. టెర్రిఫిక్ యాక్టర్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'- సచిన్ టెండూల్కర్

‘ఇర్ఫాన్ మరణ వార్త బాధను కలిగిస్తోంది. వారి కుటుంబానికి నా సంతాపం. ఆయనో అద్భుతమైన నటుడు. మీరు మాకు దూరమైనా మా మనసుల్లో ఎప్పటికీ ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి.'-మహ్మద్ షమీ

అరుదైన రత్నం..

‘గొప్ప నైపుణ్యం కలిగిన గొప్ప నటుడు. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతిని తెలయజేస్తున్నా'అని వీరేంద్ర సెహ్వాగ్

‘పాత్ర, మీడియంతో సంబంధం లేకుండా కేవలం వారి నటనతో ఆకట్టుకునే నటులున్నారు. ఈ అరుదైన రత్నాలలో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. కానీ అనివార్య కారణాల వల్ల ఆయన మనల్ని త్వరగా విడిచివెళ్లాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి'-గౌతం గంభీర్

గత శనివారమే ఇర్ఫాన్ తల్లి మృతి..

సురేశ్ రైనా, హర్షాబోగ్లే, మహ్మద్ కైప్, సందీప్ శర్మ తదితర ఆటగాళ్లు సైతం ఇర్ఫాన్ ఖాన్ తమ అభిమాన నటుడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు. గత శనివారమే ఇర్ఫాన్ తల్లి సయిదా బేగం.. రాజస్థాన్​లోని జైపుర్​లో క‌న్నుమూశారు. మ‌న ద‌గ్గ‌ర లాక్​డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల‌వుతుండ‌టంతో ఇర్ఫాన్ త‌న త‌ల్లిని కడసారి కూడా చూడ‌లేకోయాడు. తల్లి అంత్యక్రియలను వీడియో కాల్​ ద్వారానే ఇర్ఫాన్ చుశారని అతడి స్నేహితులు తెలిపారు. ఇలా ఆ ఫ్యామిలిలో వరుస మరణాలు సంభవించడం బంధువులు, సన్నిహితుల్ని తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింది.

Story first published: Wednesday, April 29, 2020, 16:04 [IST]
Other articles published on Apr 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X