న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: 9 సిక్సర్లతో ఎవిన్ లూయిస్ వీరవిహారం.. సెయింట్ కిట్స్ థ్రిల్లింగ్ విక్టరీ!

CPL 2020: Evin Lewis’ 89 helps Patriots secure much-needed win

ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2020 సీజన్‌లో బుధవారం అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజా లభించింది. బార్బోడస్ ట్రిడెంట్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. సెయింట్ కిట్స్ బ్యాట్స్‌మన్ ఎవిన్ లూయిస్ (60 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో) చెలరేగి ఒంటిచేత్తో విజయాన్నందించాడు. ఏకంగా 9 సిక్లర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. చివర్లో బెన్ డంక్(11 బంతుల్లో 22) కూడా ఓ చేయి వేయడంతో సెయింట్ కిట్స్ 6 వికెట్ల తేడాతో లీగ్‌లో విజయాల ఖాతా తెరిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బార్బోడస్ ట్రిడెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 రన్స్ చేసింది. కోరే అండర్సన్(31), షై హోప్(29), అష్లే నర్స్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సెయింట్ కిట్స్ బౌలర్లలో సోహైల్ తన్వీర్, జోసెఫ్, ఎమ్రిత్, ఖాన్ తలో వికెట్ తీయగా.. జగ్గేసర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్ లూయిస్ విరవిహారానికి తోడుగా రామ్ దిన్(20), డంక్(22) రాణించడంతో 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 152 రన్స్ చేసింది 3 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. బార్బోడస్ బౌలర్లలో హోల్డర్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీయగా.. మేయర్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.

లూయిస్ ఉన్నంత సేపు సెయింట్ కిట్స్ విజయం సునాయసం అనిపించింది. అయితే విజయానికి 20 పరుగులు కావాల్సిన సందర్భంలో లూయిస్ భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో సెయింట్ కిట్స్ విజయానికి 12 పరుగులు కావాల్సి ఉండగా.. ఉత్కంఠతను తట్టుకోలేకపోయి ప్రత్యర్థి బౌలర్ల తొలి బంతిని వైడ్ వేసాడు. తర్వాతి బాల్ డాట్‌గా మారడంతో ఇరు జట్లలో ఉత్కంఠత పెరిగింది. కానీ డంక్ తన మార్క్ స్టైల్లో వరుసగా రెండు సిక్స్‌ల కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.

సచిన్ పెద్ద మనసు.. కళియుగ కర్ణుడు సోనూ సూద్ బాటలో మాస్టర్!సచిన్ పెద్ద మనసు.. కళియుగ కర్ణుడు సోనూ సూద్ బాటలో మాస్టర్!

Story first published: Wednesday, August 26, 2020, 10:17 [IST]
Other articles published on Aug 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X