Chris Gayle: ఆ క్రికెటర్‌పై ఉన్న గౌరవం పోయింది.. యూనివర్సల్ బాస్ సంచలన వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: వెస్టిండీస్ దిగ్గజ పేసర్ కర్ట్‌లీ అంబ్రోస్‌పై విధ్వంసకర బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంబ్రోస్‌పై తనకున్న గౌరవం చచ్చిపోయిందని, అతనితో ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నానని గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ ఆరంభంలో అంబ్రోస్‌ను ఎంతో గౌరవించేవాడినని, కానీ అతను మాత్రం గత కొద్దికాలంగా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని తెలిపాడు. అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదని గేల్ చెప్పుకొచ్చాడు.

అటెన్షన్ కోసమే ఇలా చేస్తున్నాడా? అనేది అర్థం కావడం లేదని, ఒకవేళ అంబ్రోస్ అదే కోరుకుంటే తనకు కావాల్సింది ఇస్తానని గేల్ చెప్పాడు. అతని ప్రతి విమర్శను తిప్పికొడుతానని చెప్పకనే చెప్పాడు.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

యూఏఈ వేదికగా జరగనున్న అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్‌కు చోటు కల్పించడాన్ని కర్ట్‌లీ అంబ్రోస్ తప్పబట్టాడు. ఫామ్‌లో లేని అతన్ని అనవసరంగా ఎంపిక చేశారని, ఇది ఏమాత్రం బాలేదని వెస్టిండీస్ క్రికెట్ సెలెక్టర్లను అంబ్రోస్ విమర్శించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గేల్ ఎంపిక కేవలం ఓ సీనియర్ బ్యాట్స్‌మన్‌గానే జట్టులోకి తీసుకున్నారన్నాడు. తానే సెలెక్టర్ అయితే కచ్చితంగా గేల్‌ను పక్కనపెట్టేవాడినని చెప్పాడు. ఈ వ్యాఖ్యలతో తీవ్రంగా హర్ట్ అయిన గేల్.. ఓ రేడియో చానెల్‌తో మాట్లాడుతూ అంబ్రోస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అంబ్రోస్ ఉన్న గౌరవం పోయింది...

అంబ్రోస్ ఉన్న గౌరవం పోయింది...

‘నాకు అంబ్రోస్‌ ఉన్న గౌరవం చచ్చిపోయింది. జట్టులోకి నేను కొత్తగా వచ్చినప్పుడు అతనికి నేనిచ్చిన గౌరవం వేరుగా ఉండేది. కానీ ఈరోజు నాపై అతను చేసిన వ్యాఖ్యలతో చాలా హార్ట్ అయ్యాను. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటి నుంచి వ్యక్తిగతంగా నాపై మాటల యుద్దం చేస్తున్నాడు. అందరి దృష్టిని ఆకర్షించేందుకు మీడియాతో గేల్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా? అతను అదే కోరుకుంటే నేను అదే చేస్తా. అతనికి కావాల్సింది ఇస్తా. అతని వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇలా మాట్లాడుతున్నాను. నా మాటలు మనసులో నుంచి వచ్చాయి.

 నెగటీవ్ కామెంట్స్ ఆపండి..

నెగటీవ్ కామెంట్స్ ఆపండి..

నాపై ఉన్న నమ్మకంతోనే కదా ప్రపంచకప్ జట్టులోకి ఎంపికచేస్తారు. ఫామ్‌లో లేకపోవచ్చు.. కానీ అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకుంటాను. ఒక యూనివర్సల్‌ బాస్‌గా ఈ రోజుతో కర్ట్‌లీ అంబ్రోస్‌తో తెగదెంపులు చేసుకుంటున్నా. ఒకవేళ అతను నాకు ఎదురుపడితే కూడా ఇదే మాట చెబుతా. నాపై నెగెటివ్‌ ప్రచారం ఆపండి. టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌ గెలవాలని కోరుకోండి'అంటూ గేల్ చురకలంటించాడు.

బయోబబుల్‌తో విసిగి..

బయోబబుల్‌తో విసిగి..

ఇక టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ జట్టుకు ఘనమైన రికార్డు ఉంది. 2012, 2016లో ఆ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఈ రెండు సార్లు క్రిస్ గేల్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది గేల్ దారుణంగా విఫలమయ్యాడు. 16 టీ20 మ్యాచ్‌ల్లో 227 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్‌ సెంచరీ చేశాడు. ఇక దుబాయ్ వేదికగానే జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్‌లో గేల్ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

బయో బబుల్‌తో విసిగిపోయిన యూనివర్స్ బాస్.. అర్థంతరంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు. 'గత కొన్ని నెలలుగా బయో బబుల్‌లో ఉంటున్నా. సీపీఎల్ 2021 నుంచి నేరుగా ఐపీఎల్ 2021 ఆడేందుకు వచ్చా. నన్ను నేను మానసికంగా సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నా' అని క్రిస్‌ గేల్‌ పేర్కొన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, October 13, 2021, 17:26 [IST]
Other articles published on Oct 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X