న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T10 League: క్రిస్ గేల్ విధ్వంసం..12 బంతుల్లో హాఫ్ సెంచరీ! 22 బంతుల్లోనే!

Chris Gayle hits fastest fifty in T10 League, And smashes 84 Off Just 22 balls
Chris Gayle smashes 22-ball 84*- Fastest Half-Century in T10 League

దుబాయ్: క్రిస్ గేల్.. ఈ పేరు ఓ సంచలనం. క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యూనివర్సల్ బాస్ క్రీజులోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్​మన్ గేల్.. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా సిక్సుల మోత మోగిస్తుంటాడు. ఇక టీ10 క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటాడు. తాజాగా అబుదాబీ టీ10 టోర్నమెంట్‌లో సిక్సర్ల మోతతో ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. 40 ఏళ్లు దాటినా తనలో సత్తా ఇంకా తగ్గలేదని గేల్ నిరూపించాడు.

9 సిక్సులు, 6 ఫోర్లు

9 సిక్సులు, 6 ఫోర్లు

అబుదాబీ టీ10 టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో మరాఠా అరేబియన్స్‌, టీమ్ అబుదాబీ జట్ల మ్యాచ్ జరిగింది. టీమ్ అబుదాబీ తరఫున బరిలోకి దిగిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. విధ్వంసం సృష్టించాడు. 22 బంతుల్లోనే ఏకంగా 9 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 84 రన్స్ చేశాడు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గేల్.. టీ10 చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన మహమ్మద్ షెహజాద్ రికార్డును సమం చేశాడు. 2018 సీజన్లో షెహజాద్ రాజ్‌పుత్స్ జట్టు తరఫున ఆడి 12 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు.

రాణించిన హఫీజ్

రాణించిన హఫీజ్

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 97 పరుగులు చేసింది. ఓపెనర్ ముక్తర్ అలీ (14) విఫలం అయినా.. మరో ఓపెనర్ అలీషన్ షరాఫు (33) రాణించాడు. 23 బంతుల్లో 33 రన్స్ చేశాడు. పాకిస్తాన్ వెటరన్ ఆటగాళ్లు మొహ్మద్ హఫీజ్ (20), షోయబ్ మాలిక్ (15) పర్వాలేదనిపించారు. టీమ్ అబుదాబీ పేసర్ టామ్ హెల్మ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా రెండు ఓవర్లలో 8 పరుగులే ఇచ్చాడు. ఒక మెయిడిన్ వేయడం విశేషం. ఓబేడ్ మెక్కాయ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

 నలువైపులా హిట్టింగ్​తో మోతెక్కించాడు

నలువైపులా హిట్టింగ్​తో మోతెక్కించాడు

లక్ష్య ఛేదనలో క్రిస్ గేల్ విధ్వంసంతో టీమ్ అబుదాబీ జట్టు 5.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. గేల్ చేసిన 84 పరుగుల్లో 78 రన్స్ బౌండరీల రూపంలోనే రావడం విశేషం. 381 స్ట్రయిక్ రేట్​తో అతడు పరుగులు చేశాడు. క్రీజులోకి వచ్చాక తొలి ఓవర్ నుంచి గేల్ రెచ్చిపోయాడు. తన మార్క్ హిట్టింగ్​తో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. మైదానం నలువైపులా హిట్టింగ్​తో మోతెక్కించాడు. యామిన్ అహ్మద్‌జాయ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన గేల్ 18 పరుగులు రాబట్టాడు.

మరో మ్యాచ్​ గెలిస్తే

మరో మ్యాచ్​ గెలిస్తే

రెండో ఓవరలో మరో ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ తొలి రెండు బంతులను బౌండరీలుగా మలిచాడు. అదే ఓవర్లో క్రిస్ గేల్ వరుసగా మూడు సిక్సులు బాదడంతో.. 27 పరుగులొచ్చాయి. తర్వాతి ఓవర్లో స్టిర్లింగ్ ఔట్ అయినా.. గేల్ రెండు ఫోర్లు, రెండు సిక్సులు బాదాడు. నాలుగో ఓవర్లో రెండు సిక్సులు, ఐదవ ఓవర్లో ఫోర్, ఆరో ఓవర్లో సిక్స్ బాది మ్యాచ్ ముగించాడు. గేల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ గెలుపుతో పాయింట్ల పట్టికలో అబుదాబి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. ఐదు మ్యాచ్​ల్లో రెండు మాత్రమే గెలిచిన ఆ జట్టుకు గేల్ కీలకమైన సమయంలో విజయాన్ని అందించాడు. లీగ్ దశలో మిగిలిన ఒక్క మ్యాచ్​ను గెలిస్తే టీమ్ అబుదాబి ఇక ప్లేఆఫ్స్​కు చేరుతుంది.

మళ్లీ టీ20 క్రికెట్‌ ఆడాలనుకుంటున్నా.. మనసులో మాట బయటపెట్టిన రూట్‌!!

Story first published: Thursday, February 4, 2021, 15:15 [IST]
Other articles published on Feb 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X