న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Chris Gayle: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. అందుకే ‘యూనివర్స్ బాస్’ అందరివాడు!

Chris Gayle Celebrates His Last International Wicket

అబుదాబి: ఈ ప్రపంచంలోనే ఓటమిని ఆస్వాదించే జట్టు ఏదైన ఉందా? అంటే అది వెస్టిండీసే. ఆటను ఆస్వాదించడంలో వారిని మించిన వారు బహుషా ఈ భూమి మీదనే లేనట్టున్నారు. మైదానంలోని ప్రతీక్షణాన్ని వాళ్లు ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఈ టీ20 ప్రపంచకప్‌లోనూ ఆ జట్టును ఘోర పరాజయాలు వెక్కిరించినా వారి ముఖాల్లో మాత్రం చిరునవ్వు చెరగలేదు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన వెస్టిండీస్ ఒకే ఒక విజయంతో తమ ప్రయాణాన్ని ముగించింది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అయినా ఆ జట్టు కొంచెం కూడా బాధపడలేదు. ఆస్ట్రేలియా జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.

ముఖ్యంగా కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో తమ చేష్టలతో అందరి మనసులను గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్రిస్ గేల్ అయితే మ్యాచ్ అసాంతం అల్లరి అల్లరి చేశాడు. తన చివరి మ్యాచ్‌లోని ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాడు. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. చివరి మ్యాచ్ ఆడుతున్నాననే సంకేతమైతే యూనివర్స్ బాస్ ఇచ్చాడు.

గేల్ హల్చల్..

ముందుగా సన్‌ గ్లాసెస్‌తో బ్యాటింగ్‌కు రెండు భారీ సిక్స్‌లు బాదిన గేల్.. ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ అభిమానులను అలరించాడు. బౌలింగ్ చేసి తన చేష్టలతో నవ్వులు పూయించాడు. ఆసీస్‌ విజయానికి దగ్గరైన వేళ 16వ ఓవర్‌ను వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్.. గేల్‌తో వేయించాడు. ఈ ఓవర్‌‌ను క్యాప్ తీయకుండానే బౌలింగ్ చేసిన గేల్.. తన చేష్టలతో ఆకట్టుకున్నాడు. అతని ఫన్నీ బౌలింగ్‌ను ఆసీస్‌ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌‌లు కూడా ఎంజాయ్ చేశారు. ఈ ఓవర్ మూడో బంతికి వార్నర్‌ కొద్దిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. స్టంపింగ్ చేసే అవకాశం రాగా.. కీపర్ నికోలస్ పూరన్ చేజార్చాడు. దాంతో వార్నర్ దగ్గరకు వెళ్లిన క్రిస్ గేల్ అతన్ని తడుతూ ఎదో చెప్పాడు. ఇక ఈ ఓవర్‌ చివరి బంతికి మిచెల్‌ మార్ష్‌ను ఔట్‌ చేసిన గేల్.. అంతర్జాతీయ టీ20 కెరీర్‌ను ఘనంగా ముగించాడు.

నవ్వులే నవ్వులు..

ఈ వికెట్‌తో సెంచరీ సాధించినంత సంతోషం వ్యక్తం చేసిన గేల్.. మిచెల్ మార్ష్‌తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. మైదానం వీడి వెళ్తున్న అతని దగ్గరకు పరుగెత్తి మరి భుజాలపై ఎక్కి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీనికి మార్ష్ సైతం గేల్‌ను అభినందిస్తూ అతన్ని సంబరాల్లో భాగస్వామి అయ్యాడు. ఈ సన్నివేశం చూసిన కామెంటేటర్లు క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాట్స్‌మన్‌తో కలిసి బౌలర్ సంబరాలు చేసుకోవడం బహుషా ఇదే తొలిసారేమోనని వ్యాఖ్యానించారు. ప్రస్తుం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ తరహా ప్రవర్తనతో గేల్ అందరివాడయ్యాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

చెలరేగిన వార్నర్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 రన్స్ చేసింది. కెప్టెన్ కీరన్ పోలార్డ్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 44), ఎవిన్ లూయిస్(26 బంతుల్లో 5 ఫోర్లతో 29) రాణించగా.. చివర్లో ఆండ్రీ రస్సెల్(7 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 18 నాటౌట్) కీలక పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/39) నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 161 రన్స్ చేసి 22 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకున్నారు. డేవిడ్ వార్నర్(56 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 నాటౌట్), మిచెల్ మార్ష్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Saturday, November 6, 2021, 22:21 [IST]
Other articles published on Nov 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X