న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సరికొత్త లుక్‌తో అదరగొట్టిన టెస్టు స్పెషలిస్ట్.. చూస్తే మతిపోవాల్సిందే!!

Cheteshwar Pujara responds to Virat Kohli after donning new look

గుజరాత్: భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, నయా వాల్ చతేశ్వర్ పుజారాను మనం ఎప్పుడూ తెల్లటి దుస్తుల్లోనే (టెస్ట్ డ్రెస్) చూస్తుంటాం. వన్డే, టీ20లు పెద్దగా ఆడకపోవడంతో ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌ టెస్ట్ డ్రెస్‌లోనే మనకు దర్శనమిస్తుంటాడు. అయితే తాజాగా పుజారా కొత్త లుక్‌తో ఆకట్టుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఫొటో పంచుకున్న అతడు అందులో చాలా స్టైలిష్‌గా తయారయ్యాడు.

 న్యూలుక్‌తో ఆకట్టుకున్న టెస్టు స్పెషలిస్ట్:

న్యూలుక్‌తో ఆకట్టుకున్న టెస్టు స్పెషలిస్ట్:

ఛెతేశ్వర్‌ పుజారా ఫార్మల్ డ్రెస్‌లో అదరగొట్టాడు. చైనీస్ కాలర్ షర్ట్, బూట్ కట్ పాయింట్, లోఫర్ షూ వేసి అందంగా తయారయ్యాడు. ఈ సరికొత్త లుక్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుని.. 'అప్రిసియేషన్‌ అండ్‌ గ్రాటిట్యూడ్‌' అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా తరపున 77 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన చటేశ్వర్‌ పుజారా 48.86 సగటుతో 5,840 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు (3 డబుల్‌ సెంచరీలు), 25 అర్థ సెంచరీలున్నాయి. ఇక 5 వన్డేలు ఆడి 51 రన్స్ చేసాడు.

అదిరిపోయావ్‌ పుజారా:

అదిరిపోయావ్‌ పుజారా:

సోషల్ మీడియాలో చతేశ్వర్ పుజారా సరికొత్త లుక్‌ చూసిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా స్పందించాడు. 'వావ్.. అదిరిపోయావ్‌ పుజారా' అని పేర్కొన్నాడు. దీనికి పుజారా బదులిస్తూ... 'నీ నుంచే స్ఫూర్తి పొందా'నని చెప్పాడు. అనంతరం పుజారా తన సతీమణి పూజాతో కలిసి మరో చిత్రాన్ని పంచుకున్నాడు. అది కూడా నెటిజన్లను ఆకర్షించింది. ప్రస్తుతం పూజారా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలో పుజారా ఇంట్లోని పనులతో బిజీబిజీగా గడిపాడు. మరోవైపు ఖాళీ సమయమంతా కుటుంబంకు వెచ్చించాడు.

 మళ్లీ బ్యాట్ పట్టిన పుజారా:

మళ్లీ బ్యాట్ పట్టిన పుజారా:

తాజాగా చతేశ్వర్ పుజారా మూడు నెలల విరామం తర్వాత మళ్లీ బ్యాట్ పట్టాడు. మార్చిలో సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీలో ఆడిన పుజారా.. ఆ తర్వాత కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఈ మధ్యన కరోనా లాక్‌డౌన్‌ సడలింపులతో.. రాజ్‌కోట్‌లోని తన క్రికెట్‌ అకాడమీలో రంజీ జట్టు సభ్యులతో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. తాజా ప్రాక్టీస్ సెషన్‌కి ముందు ఫ్యాడ్స్‌ని కట్టుకుంటున్న ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. 'నేనొచ్చేశా. చాలా కాలం దూరంగా ఉన్నట్లు అనిపించింది. అయితే ప్రాక్టీస్‌ మొదలుపెట్టాక నిన్ననే ప్రాక్టీస్‌ చేసినట్లు అనిపించింది' అంటూ దానికి కామెంట్‌ జత చేశాడు.

521 పరుగులతో టాప్ స్కోరర్‌గా:

భారత్ తరఫున కేవలం టెస్టులు మాత్రమే చతేశ్వర్ పుజారా ఆడుతున్నాడు. టీమిండియా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడబోతోంది. దీంతో ఇప్పటి నుంచే పుజారా ప్రాక్టీస్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. డిసెంబరు 3 నుంచి బ్రిస్బేన్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. 2018-19 పర్యటనలో కోహ్లీసేన 2-1తో ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో పుజారా అద్భుతంగా ఆడాడు. 74.42 యావరేజితో 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.

యువరాజ్‌పై ప్రతీకారం తీర్చుకున్న రవిశాస్త్రి!!

Story first published: Friday, June 26, 2020, 9:26 [IST]
Other articles published on Jun 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X