న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 Auction: కోట్లు పలికిన టెంపో డ్రైవర్ కొడుకు.. సంతోషం పంచుకోవడానికి తమ్ముడు లేడు!

Chetan Sakariya misses late brother on the day he bags Rs 1.20 crore Deal For IPL 2021
IPL 2021 : Tempo Driver’s Son Chetan Sakariya చాలా పేద కుటుంబం, ఇల్లు కొనుక్కోవాలి !! || Oneindia

హైదరాబాద్: ఐపీఎల్ పుణ్యమా చాలా మంది యువ ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. గురువారం జరిగిన ఐపీఎల్ 2021 వేలంలో కూడా ఓ టెంపో డ్రైవర్ కొడుకు, సౌరాష్ట్ర రంజీ ప్లేయర్ చేతన్ సకారియా కూడా భారీ ధర పలికాడు. వేలంలో ఈ లెఫ్టార్మ్ పేసర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో మీడియా అతన్ని పలకరించగా.. ఈ సంతోషాన్ని పంచుకోడానికి తనకెంతో ఇష్టమైన తమ్ముడు లేడని చేతన్‌ సకారియా ఆవేదన వ్యక్తం చేశాడు.

గతనెలలో తాను సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడుతుండగా తన సోదరుడు రాహుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడని చేతన్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పుడు అతను ఉండి ఉంటే తనకంటే ఎక్కువ సంతోషించే వాడని చెప్పుకొచ్చాడు.

తమ్ముడు చనిపోయిన విషయం తెలియదు..

తమ్ముడు చనిపోయిన విషయం తెలియదు..

'ఇప్పుడు నా తమ్ముడు బతికి ఉంటే నాకంటే ఎక్కువ సంతోషించేవాడు. జనవరిలో నేను ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడడానికి వెళ్లినప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఇంటికి వచ్చే వరకు ఎవరూ ఈ విషయం చెప్పలేదు. టోర్నీలో ఆడుతున్నన్ని రోజులు రాహుల్‌ ఎక్కడున్నాడని ఇంట్లోవాళ్లను అడిగితే.. ఏదో పనిమీద బయటకు వెళ్లాడని సాకులు చెప్పేవాళ్లు. అతను చనిపోయాడనే విషయం కూడా తెలియనివ్వలేదు. ఇంటికి వెళ్లాకే అసలు విషయం తెలిసింది.

నా తమ్ముడు లేని లోటు పూడ్చలేనిది." అని చేతన్‌ కన్నిటీ పర్యంతమయ్యాడు. కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరిగిన విషయం తెలిసిందే. తమ్ముడు చనిపోయిన విషయం చెబితే చేతన్ కెరీర్ దెబ్బతింటుందని భయపడ్డ అతని తల్లిదండ్రులు ఆ విషయం చెప్పుకుండా దాచారు.

గత సీజన్‌లోనే తెలుసు..

గత సీజన్‌లోనే తెలుసు..

గత ఐపీఎల్ సీజన్‌లో ఈసారి సెలెక్టవుతాననే నమ్మకం తనకు ఏర్పడిందని చేతన్ తెలిపాడు. 'యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు నెట్‌బౌలర్‌గా సేవలందించా. అక్కడ ఆ జట్టు కోచ్‌లు మైక్‌ హెసన్‌, సైమన్‌ కటిచ్‌ నాతో మాట్లాడారు. ఐపీఎల్‌లో ఏ జట్టుకైనా ఎంపికయ్యే అన్ని అర్హతలూ సాధించానని చెప్పారు.

దాంతో ఈసారి కచ్చితంగా ఏదో ఒక జట్టుకు ఎంపిక అవుతాననే నమ్మకంతో ఉన్నాను. నా కోసం వేలంలో ఆర్సీబీ కూడా ప్రయత్నించింది. కానీ రాజస్థాన్‌ దక్కించుకుంది. ఏ జట్టుకు ఆడినా నాకు సంతోషమే.'అని చేతన్ చెప్పుకొచ్చాడు.

ఇల్లు కొనుక్కుంటా..

ఇల్లు కొనుక్కుంటా..

ఇంత డబ్బు ఏం చేస్తావని చాలా మంది అడుగుతున్నారని, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నట్లు ఈ లెఫ్టార్మ్ పేసర్ తెలిపాడు. 'మా నాన్న టెంపోవ్యాన్‌ డ్రైవర్‌. మాది చాలా పేద కుటుంబం. ఎంతలా అంటే గత ఐదేళ్ల కిందట మాకు కనీసం టీవీ కూడా లేదు. క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు స్నేహితుల ఇంటికో.. లేక టెలివిజన్ షో రూమ్స్‌లనే చూసేవాడిని.

ఇప్పుడు ఇంత మొత్తం వచ్చేసరికి.. ఆ డబ్బుతో ఏం చేస్తావని అంతా అడుగుతున్నారు. తొలుత ఆ డబ్బు అయితే, రానివ్వండి. తర్వాత చూద్దాం' అని బదులిస్తున్నా. కానీ, ఒక మంచి ప్రదేశంలో సొంత ఇంట్లో ఉండాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ డబ్బుతో రాజ్‌కోట్‌లో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా'అని ఈ యువ క్రికెటర్‌ తన కోరికను వెల్లడించాడు.

అరంగేట్ర మ్యాచ్‌లోనే..

అరంగేట్ర మ్యాచ్‌లోనే..

2018-19 రంజీ ట్రోఫీ సీజన్‌లో సౌరాష్ట్ర పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ గాయపడటం వల్ల ఆ స్థానంలో చేతన్‌ రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు సాధించాడు. ఇక ఆ సీజన్‌ మొత్తంలో సుమారు 30 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆపై బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర విజయంలోనూ చేతన్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తరఫున ఎంపికయ్యాడు.

Story first published: Friday, February 19, 2021, 15:58 [IST]
Other articles published on Feb 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X