న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉగ్రవాదులున్నంత కాలం భారత్ vs పాక్ ద్వైపాక్షిక సిరీస్‌‌లు జరగవు : మాజీక్రికెటర్

Chetan Chauhan Says Bilateral series between India, Pakistan shouldnt take place

న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఆకాంక్షించిన విషయం తెలిసిందే. దాయదుల సమరం యాషెస్ కంటే పెద్ద సిరీస్ అవుతుందని కూడా ఈ లెంజండరీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

కానీ భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ మాత్రం ఉగ్రవాదులున్నంత కాలం భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం అసాధ్యమని తేల్చేశాడు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కష్టమని అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ అంత సురక్షితం కాదని చెప్పుకొచ్చాడు.

పాక్‌ సురక్షితం కాదు..

పాక్‌ సురక్షితం కాదు..

‘భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. ద్వైపాక్షిక సిరీస్ జరగడం అసాధ్యం. ఇక పాకిస్థాన్‌‌లోకి వెళ్లి క్రికెట్ ఆడటం అంత సురక్షితం కూడా కాదు. టెర్రరిస్ట్‌లు క్రికెటర్లపై ఏమాత్రం జాలిచూపరు. ఆ దేశంలో ఉగ్రవాదులు ఉన్నంతకాలం.. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవు' అని చౌహాన్ స్పష్టం చేశాడు.

రాహుల్ బ్రో.. నువ్వు 12వ స్థానంలో కూడా సెంచరీ చేస్తావ్ : ధావన్

రహానేను తీసుకోవాలి..

రహానేను తీసుకోవాలి..

ఇక న్యూజిలాండ్‌లో భారత్ వన్డే సిరీస్ ఓటమిపై కూడా చౌహాన్ స్పందించాడు. రహానేను వన్డేల్లోకి తీసుకోవాలని సూచించాడు.

‘ధావన్, రోహిత్ గాయాల నేపథ్యంలో అజింక్యా రహానేను జట్టులోకి తీసుకోవాలి. అప్పుడే జట్టు సమతూకంగా ఉంటుంది. నిలకడగా ఆడే వారిని జట్టులోకి తీసుకోవాలి.'అని అభిప్రాయపడ్డాడు.

బుమ్రా అలసిపోయాడు..

బుమ్రా అలసిపోయాడు..

వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమైన బుమ్రా కొంచెం అలిసిపోయినట్లు కనిపించాడని ఈ మాజీ క్రికెట్ తెలిపాడు.

‘బుమ్రా కొంచెం అలసి పోయినట్టున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తుందని ఆశిస్తున్నా. అనుభవం కలిగిన రహానే వంటి ఆటగాళ్లు జట్టుకు అండగా ఉంటారు. కానీ రోహిత్, ధావన్‌లను మిస్సవ్వనున్నాం.'అని చౌహన్ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 21 నుంచి రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం‌కానుంది.

పాక్‌లో ఆసియా‌కప్..

పాక్‌లో ఆసియా‌కప్..

ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుండగా.. అక్కడికి వెళ్లి ఆ టోర్నీలో ఆడే ప్రసక్తే లేదని భారత్ చెప్తోంది. దీంతో.. టీమిండియా పాక్‌కు రాకపోతే.. వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే వరల్డ్‌కప్‌ను తాము బహిష్కరిస్తామని పాక్ హెచ్చరిస్తోంది. అయితే.. తటస్థ వేదిక(యూఏఈ)లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము ఆడతామని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. ఇక భారత్, పాకిస్థాన్ మధ్య చివరిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది.

క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. క్రీడాస్పూర్తికి విరుద్దమంటూ మాజీల ఫైర్

10 ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే..

10 ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే..

పాకిస్థాన్ గడ్డపై 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు కూడా ముందుకు రాలేదు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత గతేడాది అదే శ్రీలంక మళ్లీ అక్కడికి వెళ్లి టీ20 సిరీస్ ఆడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ టీమ్ పాక్‌లో పర్యటిస్తోంది. ఈ రెండు జట్లకు దేశ అధ్యక్షుడి స్థాయి భద్రతను పాక్‌ కల్పించింది.

Story first published: Wednesday, February 12, 2020, 20:56 [IST]
Other articles published on Feb 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X