For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. క్రీడాస్పూర్తికి విరుద్దమంటూ మాజీల ఫైర్

Stump mic cable blocks a run out as Meg Lanning in a never seen before incident

మెల్‌బోర్న్ : మహిళల ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే ఇంతవరకు కనివిని ఎరుగని ఈ ఘటనపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం భారత మహిళలతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 11 పరుగులతో విజయం సాధించి టైటిల్ అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టంప్స్ మైక్ కారణంగా ఆసీస్ కెప్టెన్ మెగ్‌లాన్నింగ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది.

ఇంతకేం జరిగిందంటే..

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో లాన్నింగ్ సిల్లీ మిడాఫ్ మీదుగా ఆడి క్విక్ సింగిల్‌కు ప్రయత్నించింది. అయితే ఎక్స్‌ట్రా కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శిఖా పాండే వేగంగా బంతిని అందుకొని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లకు కొట్టింది. కానీ బంతి వికెట్లకు తాకుండా స్టంప్ మైక్‌ కేబుల్ బాక్స్‌కు తాకి పక్కకు వెళ్లింది. అప్పటికి లాన్నింగ్ క్రీజుకు చాలా దూరంలో ఉంది. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి ఆమె తప్పించుకొని ఊపిరి పీల్చింది. అంతటితో ఆగకుండా మరో పరుగు తీసి క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించింది. ఆ మరుసటి ఓవర్‌లోనే లాన్నింగ్(26) ఔటైనప్పటికీ ఈ రనౌట్ వ్యవహారం, ఆమె మరోపరుగు తీవ్ర చర్చనీయాంశమైంది.

నీషమ్ ఈ గొడవ ఏప్రిల్‌లో చూసుకుందాం: రాహుల్

క్రీడాస్పూర్తికి విరుద్దం..

క్రీడాస్పూర్తికి విరుద్దం..

క్రికెట్‌లో తప్పులు జరగకుండా ఉండేందుకే సాంకేతికతను వాడుతున్నారని, కానీ అవే ఆటకు అడ్డంకి మారితే ఎలా? అనే అభిప్రాయయం వ్యక్తం అవుతుంది. ఫీల్డ్ అంపైర్ ఇబ్బంది పెట్టే ఎల్బీడబ్ల్యూ, రనౌట్, క్యాచ్ ఔట్‌లో ఖచ్చితమైన ఫలితం కోసం సాంకేతికతను వాడుకుంటారు. అలాగే అంపైర్ నిర్ణయానికి పున సమీక్షకు, నోబాల్ నిర్ణయాలకు ఉపయోగిస్తారు. కానీ ఆ సాంకేతికతనే ఇప్పుడు రనౌట్ కాకుండా అడ్డుకోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ముమ్మాటికి క్రీడాస్పూర్తికి విరుద్దమనే అభిప్రాయయం వ్యక్తం అవుతోంది.

 కామెంటేటర్లు కూడా..

కామెంటేటర్లు కూడా..

ఈ ఘటనపై కామెంటేటర్లు కూడా మ్యాచ్ జరుగుతుండగా స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చానెల్ సెవెన్ వ్యాఖ్యాత బ్రాడ్ హోడ్జ్ మాట్లాడుతూ.. ఈ ఘటన తనని షాక్‌కు గురిచేసిందని, ఇలాంటివి క్రికెట్ మైదానంలో చోటుచేసుకోకూడదని తెలిపాడు. మరో కామెంటేటర్ ఎలిస్ విల్లాని ఇది ముమ్మాటికి క్రీడా స్పూర్తికి విరుద్దమేనని తెలిపింది. ఆసీస్ కెప్టెన్ లాన్నింగ్ తీరును కూడా ఆమె తప్పుబట్టింది. పరుగు తీస్తున్న క్రమంలో బంతి బ్యాట్‌కు తగిలినా.. లేక వేరే వస్తువుకు తగిలినా మరో పరుగు తీయవద్దనే విషయం అందరికి తెలిసిందే. కానీ లాన్నింగ్ మరో పరుగుకు తీసి క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించిందని మండిపడింది. సాంకేతికంగా ఆమెకు పరుగు లభించింది కానీ.. క్రీడా స్పూర్తి ప్రకారం ఆమె ఓడిందని ఎలిస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదే నా నీ క్రీడా స్పూర్తి..

ఇదే నా నీ క్రీడా స్పూర్తి..

లైఫ్ లభించిన లాన్నింగ్.. రెండో పరుగు తీయడంపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంతి మైక్‌కు తాకి వెళ్లితే అలాఏలా మరో పరుగు తీస్తావ్? అని అభిమానులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. లాన్నింగ్ ఇలా చేయాల్సి ఉండేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

మంధాన మెరిసినా..

మంధాన మెరిసినా..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ బెత్ మూనీ (71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగింది. భారత బౌలర్లలో దీపిక శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ రెండేసి వికెట్లు తీయగా.. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఆసీస్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ నిర్ణీత ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ స్మృతి మంధాన 66 పరుగులతో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Story first published: Wednesday, February 12, 2020, 15:25 [IST]
Other articles published on Feb 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+