న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK: అయ్యో దేవుడా.. రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు మళ్లీ పాజిటివ్‌.. చెన్నైకి తప్పని కష్టాలు!!

Chennai Super Kings batsman Ruturaj Gaikwad remains coronavirus positive

దుబాయ్: ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ ‌కింగ్స్‌ జట్టును ఇప్పట్లో కరోనా వైరస్ వదిలేలా కనిపించట్లేదు. చెన్నై యువ బ్యాట్స్‌మన్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ఇప్పటికీ వైరస్‌తో బాధపడుతున్నాడు. 14 రోజుల క్వారంటైన్ ముగిసినా.. తాజాగా నిర్వహించిన ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో ఫలితం పాజిటివ్‌గానే వస్తోందని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం అతడు హోటల్ గదిలో ఐసోలేషన్‌లో ఉన్నాడట.

13 మందికి వైరస్

13 మందికి వైరస్

ఐపీఎల్ 13వ సీజన్ కోసం ఆగస్టు 20 తర్వాత దుబాయ్‌ చేరుకున్న చెన్నై సూపర్ ‌కింగ్స్‌ బృందంలో ఇద్దరు ఆటగాళ్లు దీపక్ చహర్, రుత్‌రాజ్‌ గైక్వాడ్.. 11 మంది సహాయ సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. దాంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ త్వరగానే కోలుకొన్నాడు. ఇటీవల జరిపిన పరీక్షల్లో నెగెటివ్‌గా తేలడంతో జట్టుతో కలిసి అతడు సాధన చేస్తున్నాడు. మిగతా సిబ్బంది కూడా కరోనా నుంచి కోలుకున్నారు. అందరూ బుడగలోకి ప్రవేశించారు.

ఎలాంటి వైరస్ లక్షణాలు లేవు

ఎలాంటి వైరస్ లక్షణాలు లేవు

బ్యాట్స్‌మన్‌ రుతురాజ్ గైక్వాడ్‌కు‌ మాత్రం ఇంకా తగ్గకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే అతనికి ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోవడం విశేషం. తాజాగా నిర్వహించిన ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో ఫలితం పాజిటివ్‌గా రావడంతో అతడు హోటల్ గదికే పరిమితమయ్యాడు. దీంతో చెన్నై జట్టు ప్రణాళికలు, కూర్పులో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. స్టార్ ఆటగాడు సురేశ్‌ రైనా టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో రుత్‌రాజ్‌ను ఆడించాలన్నది సీఎస్‌కే ప్రణాళికగా తెలుస్తోంది. ఇక నెగెటివ్‌ వచ్చేదాక అతడు ప్రాక్టీస్‌ చేయలేడు. సాధన లేకుండా నేరుగా మ్యాచులోకి దించే పరిస్థితి ఉండదు. అందుకే వన్‌డౌన్‌లో అంబటి రాయుడిని ఆడించాలని చెన్నై అనుకుంటోందని సమాచారం.

ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు దూరం

ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు దూరం

ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌లు జట్టుకు దూరం కావడంతో సీఎస్‌కే అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో కూడా వీక్‌గానే కనబడుతోంది. బ్యాటింగ్‌లో రైనా స్థానాన్ని అంబటి రాయుడు, మురళీ విజయ్‌తో పూడ్చాలని చూస్తున్న సీఎస్‌కే.. బౌలింగ్‌లో పరుగులు నియంత్రణ చేసేది ఎవరూ అనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. ఇమ్రాన్‌ తాహీర్‌ వంటి స్పిన్నర్‌ సీఎస్‌కేకు అందుబాటులో ఉన్నా భజీ స్థానాన్ని ఏదో రకంగా భర్తీ చేయాలనే కసరత్తులు చేస్తోంది.

IPL 2020: క్వారంటైన్‌ పూర్తి.. షార్జా స్టేడియాన్ని చుట్టేసిన సౌరవ్ గంగూలీ!!

Story first published: Tuesday, September 15, 2020, 14:39 [IST]
Other articles published on Sep 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X