న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: క్వారంటైన్‌ పూర్తి.. షార్జా స్టేడియాన్ని చుట్టేసిన సౌరవ్ గంగూలీ!!

IPL 2020: Sourav Ganguly visited Sharjah Cricket Stadium to take stock of preparations

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 సీజన్‌ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్‌ 19న రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనుంది. ఇప్పటికే లీగ్‌లో పాల్గొనే జట్లన్నీ తమ ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఈసారి ఐపీఎల్‌లో మ్యాచ్‌లన్నీ షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదికగా జరగనున్నాయి. ఐపీఎల్‌ టోర్నీ కోసం జరుగుతున్న ఏర్పాట్లను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్వయంగా పరిశీలించాడు.

సెప్టెంబర్‌ 9న దుబాయ్‌ వెళ్లిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నిబంధనల ప్రకారం ఆరు రోజల క్వారంటైన్‌లో ఉన్నాడు. తాజాగా క్వారంటైన్‌ ముగియడంతో ఐపీఎల్‌ 13వ సీజన్‌కు సంబంధించిన పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. తాజాగా మంగళవారం ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌, ​సీవోవో హేమంగ్‌ అమిన్‌తో కలిసి గంగూలీ షార్జా స్టేడియం పరిసరాలను సందర్శించాడు. స్టేడియంలో కొత్తగా నిర్మించిన వసతులపై దాదా సంతృప్తి వ్యక్తం చేశాడు.

సౌరవ్ గంగూలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షార్జా స్టేడియం ఫోటోలను షేర్‌ చేశాడు. 'కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ దుబాయ్‌లో జరుగుతుంది. మ్యాచ్‌లు జరగనున్న షార్జా స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఐకానిక్‌ స్టేడియంలో నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఐపీఎల్‌ ద్వారా భారత యువ ఆటగాళ్లు షార్జా స్టేడియంలో మ్యాచ్‌లు ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భారత దిగ్గజాలు సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌ లాంటి ఆటగాళ్లకు కూడా ఈ స్టేడియంలో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి' అని ట్వీట్ చేశాడు.

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీకి షార్జా స్టేడియంలో ఘనమైన రికార్డు ఉంది. ఒక సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీలతో 700 పరుగులకు పైగా చేశాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌ మూడు వేదికల్లో ఒకటైన షార్జాలో మొత్తం 12 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. సెప్టెంబర్‌ 22న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఈ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది.

View this post on Instagram

Famous Sharjah stadium all set to host IPL 2020

A post shared by SOURAV GANGULY (@souravganguly) on

ఐపీఎల్‌లో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'లు అందుకుంది వీరే.. భారత్ నుంచి ఇద్దరు!!

Story first published: Tuesday, September 15, 2020, 13:58 [IST]
Other articles published on Sep 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X