న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Candice Warner: మా ఆయన ఫామ్‌లో లేరా అండి? విమర్శకులపై వార్నర్ సతీమణి సెటైర్స్!

Candice Warner Satires Trollers On Commenting David Warners Form
T20 World Cup 2021 : విమర్శకులపై David Warner సతీమణి సెటైర్స్! || Oneindia Telugu

Candice Warner Satires: ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ కెరీర్ ముగిసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. ప్రతీ సీజన్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన వార్నర్.. ఈ సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండు దశల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 195 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. చివరకు టీమ్ డగౌట్‌లోకి కూడా అతనికి అవకాశం దక్కలేదు. టీ20 ప్రపంచకప్‌ ప్రాక్టీస్ మ్యాచ్‌లతో పాటు ఆరంభం మ్యాచ్‌ల్లోను వార్నర్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో వార్నర్ కెరీర్ ముగిసినట్లేనని, ఫామ్ కోల్పోయిన అతను మరీ నెమ్మదిగా ఆడుతున్నాడని, అతని బ్యాటింగ్ పాత తరంలా ఉందని విమర్శలు గుప్పించారు.

అయితే శ్రీలంకతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ‌తో టచ్‌లోకి వచ్చిన వార్నర్ తన ఫామ్‌ను ఫైనల్ వరకు కొనసాగించాడు. అద్వితీయమైన బ్యాటింగ్‌తో ఆసీస్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 284 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి విమర్శకులు ముక్కున వేలు వేసుకునేలా చేశాడు. ఇందులో (65, 89 నాటౌట్, 49, 53) నాలుగు విన్నింగ్ నాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా వెస్టిండీస్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో వార్నర్ ఆడిన తీరు.. సెమీస్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పయినా తీవ్ర ఒత్తిడిలో స్వేచ్చగా ఆడిన విధానం అతని కెరీర్‌లోనే హైలైట్.

ఇక వార్నర్ ఫామ్‌లోకి రావడంతో అతని సతీమణి క్యాండిస్ వార్నర్ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. విమర్శకుల ప్రతీ మాటను గుర్తు పెట్టుకున్నా ఆమె వారికి తనదైన శైలిలో బదులిచ్చింది. వార్నర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఫొటోను షేర్ చేస్తూ.. 'మా ఆయన ఫామ్‌లో లేరా అండి?'అని ప్రశ్నిస్తూ విమర్శకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఫామ్ కోల్పోయి, పాత తరం ఆట ఆడుతున్న డేవిడ్ వార్నర్‌కు అభినందనలు అంటూ.. నవ్వుకునే ఏమోజీలతో సెటైన్లు పేల్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారాయి. 'వామ్మో.. వార్నర్ పెళ్లాంతో పెట్టుకుంటే కష్టమే సుమా'అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొంది. తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85) అద్భుతంగా ఆడగా... హాజల్‌వుడ్‌ (3/16) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఆసీస్‌ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' మిచెల్‌ మార్ష్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్‌), డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ'గా నిలిచాడు.

Story first published: Monday, November 15, 2021, 12:33 [IST]
Other articles published on Nov 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X