For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఇద్దరితో టీమిండియాకు ప్రమాదం: ప్రముఖ జ్యోతిష్యుడు

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియాకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర‌తో పాటు గ్లేన్ ఫిలిప్స్‌తో టీమిండియాకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించాడు. అంతేకాకుండా మ్యాచ్‌లో కీలక సమయాలను ఎక్స్‌వేదికగా వెల్లడించాడు.

'ఈ రోజు జరగబోయే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అహ్మదాబాద్ స్టేడియం సెంటిమెంట్లు.. ఆదివారం నాటి ఓటములు, ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై గెలవలేకపోవడం వంటి పాత పోలికలన్నింటినీ పక్కన పెట్టాలి. ఎందుకంటే 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలు ఈరోజు భారత జట్టుకు తోడుగా ఉన్నాయి.

అయితే ఈరోజు అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఫైనల్లో భారత్ రచిన్ రవీంద్ర పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ ప్రత్యర్థి జట్టుకు కీలకమైన గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది. మరొక ప్రమాదకరమైన ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్.

Astrologer Sumit Bajaj Warns India of Rachin Ravindra s Game-Changing Threat in T20 World Cup 2026 Final

ఈ ఫైనల్లో ముఖ్యమైన సమయాలు: 7:09 - 7:13: వికెట్ పడే అవకాశం, 7:14 - 7:18: కీలక వికెట్, 7:22 - 7:26: ముఖ్యమైన సమయం, 7:44 - 7:52: ఇన్నింగ్స్ మధ్యలో వికెట్, 8:23 - 8:27, 8:32 - 8:36, 8:41 - 8:49, 8:57 వరకు: కీలక దశలు, 9:20 - 9:29: ఇన్నింగ్స్ చివరలో వికెట్, 9:33 - 9:37: అత్యంత కీలక వికెట్, 9:55 - 10:04, 10:35 - 10:40, 10:45 - 10:50: నిర్ణయాత్మక సమయాలు, రాత్రి 9:14 గంటలకు మ్యాచ్‌లో ఒక పెద్ద మార్పు సంభవించవచ్చు. ఆ తర్వాత ఆట కొంతసేపు ఏకపక్షంగా సాగే అవకాశం ఉంది.'అని సుమిత్ బజాజ్ వరుస ట్వీట్స్ చేశాడు.

సుమిత్ బజాజ్ కోల్‌కతాకు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, ప్రముఖ జ్యోతిష్యుడు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌లు, ఎన్నికలు, స్టాక్ మార్కెట్‌పై ఆయన ఇచ్చే అంచనాల ద్వారా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.

ఆయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయినప్పటికీ, గత 15-20 ఏళ్లుగా జ్యోతిషశాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ సెంచరీల రికార్డును అధిగమిస్తాడని, భారత్ ఫైనల్ చేరుతుందని ఆయన సరిగ్గా అంచనా వేశారు. అయితే, ఫైనల్‌లో భారత్ గెలుస్తుందని ఆయన చేసిన అంచనా తప్పింది. 2019 నరేంద్ర మోదీ విజయం, జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడం వంటి అంశాలను ఏడాది ముందే ఊహించారు.

Story first published: Sunday, March 8, 2026, 17:29 [IST]
Other articles published on Mar 8, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+