న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవాలి: బ్రాడ్ హగ్

Brad Hogg suggests Ravichandran Ashwin’s comeback in ODI squad

సిడ్నీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌తో తన స్పిన్ ప్రత్యర్థిని వణికిస్తున్న టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నాడు. బంతితో వికెట్లు తీసే అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ డెప్త్ కూడా బలంగా మారుతుందని సూచించాడు. వన్డేల్లోకి అతన్ని తీసుకోవడం కోహ్లీసేనకు ఎంతో మేలు చేస్తుందని ట్విటర్ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బ్రాడ్‌ సమాధానంగా చెప్పుకొచ్చాడు.

బ్యాటింగ్ బలం పెరుగుతుంది..

బ్యాటింగ్ బలం పెరుగుతుంది..

అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవడం మంచి ఆఫ్షన్. అతను జట్టులోకి వస్తే బౌలింగ్‌తో పాటు లోయరార్డర్ బ్యాటింగ్ బలం కూడా పెరుగుతుంది. దాంతో టాప్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ మరింత స్వేచ్చగా దూకుడుగా ఆడగలరు. పైగా అశ్విన్ సమయోచితంగా వికెట్లు తీయగలడు. ఎకానమీ సైతం చాలా బాగుంటుంది. అతన్ని జట్టులోకి తీసుకోండి' అని బ్రాడ్ హగ్‌ ట్వీట్‌ చేశాడు.

2017లో చివరిసారిగా..

2017లో చివరిసారిగా..

టీమిండియా తరఫున అశ్విన్‌ ఇప్పటి వరకు 111 వన్డేలు, 46 టీ20లు, 77 టెస్టులు ఆడాడు. మణికట్టు స్పిన్నర్ల రాకతో అతన్ని పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసులకు పక్కనపెట్టారు. చివరి సారిగా అతను పాకిస్థాన్‌తో జరిగిన 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. ఆ తర్వాత టీమ్‌మనేజ్‌మెంట్ ఇద్దరు లెగ్ స్పిన్నర్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో అశ్విన్ టెస్ట్‌లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ తమిళనాడు క్రికెటర్.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ సత్తాచాటి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇంగ్లండ్‌పై జోరు..

ఇంగ్లండ్‌పై జోరు..

ఆసీస్ టూర్ ఫామ్‌ను తాజా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఓ వైపు బంతితో మ్యాజిక్ చేస్తూ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వణికిస్తుండగా.. మరోవైపు లోయారార్డర్‌లో బ్యాటింగ్ వచ్చి బౌలర్ల ఓపికగా సహనంగా నిలుస్తున్నాడు. చెన్నై వేదికగా జరిగిన సెకండ్ టెస్ట్‌లో సెంచరీతో కదం తొక్కాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 24 వికెట్లు పడగొట్టి టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 77వ మ్యాచ్‌లోనే ఈ ఘనతను అందుకొని అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

Story first published: Monday, March 1, 2021, 20:33 [IST]
Other articles published on Mar 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X