న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రయాణం మొదలు.. మిథాలీలా బ్యాటింగ్‌ చేస్తున్న తాప్సీ!!

Bollywood actress Taapsee Pannu starts training for Mithali Raj Biopic Shabaash Mithu

హైదరాబాద్: భారత మహిళా వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ వస్తున్న విషయం తెలిసిందే. మిథాలీ బయోపిక్ 'శభాష్‌ మిథు'‌లో బాలీవుడ్‌ హీరోయిన్ తాప్సీ పన్నూ నటిస్తున్నారు. దర్శకుడు రాహుల్ ధోలాకియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాప్సీ బ్యాటింగ్‌ చేయడం నేర్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఒక ఫొటోను ట్విటర్‌లో పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.

ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టా:

'ఇప్పుడే బ్యాట్‌, బంతితో ప్రయాణం మొదలుపెట్టాను. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే ఇప్పటికే సగం పని పూర్తి అయినందుకు సంతోషంగా ఉంది. ఇది టీమిండియా మహిళా క్రికెటర్లతో పాటు, కెప్టెన్‌ కూల్‌ మిథాలి రాజ్‌కు మరో మైలురాయిగా నిలుస్తుంది' అని తాప్సీ పన్నూ ట్వీట్ చేశారు. 'మీరు ఈ పాత్రను పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని మిథాలీ రాజ్‌ రీ-ట్వీట్ చేశారు. గతేడాది 'థప్పడ్'‌ సినిమాతో మంచి విజయం అందుకున్న తాప్సీ ఈ బయోపిక్‌లో ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది.

మిథాలీ రాజ్‌ గేమ్‌ ఛేంజర్:

మిథాలీ రాజ్‌ గేమ్‌ ఛేంజర్:

ఈ చిత్రానికి సంబంధించి తాప్సీ గతేడాది జనవరి 29నే ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. టీమిండియా జెర్సీ ధరించి మైదానంలో బ్యాటింగ్‌ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 'పురుషుల క్రికెట్‌లో నా ఫేవరెట్‌ ఎవరని ఎప్పుడూ నన్ను అడుగుతుంటారు. కానీ మహిళల క్రికెట్‌లో మీ ఫేవరెట్‌ ఎవరని వారిని (టీమిండియా ఆటగాళ్లు) అడగాలి' అనే వ్యాఖ్యలతో ప్రతి క్రికెట్‌ అభిమానిని.. తాము ఆటను ప్రేమిస్తున్నామా లేక ఆడుతున్న వ్యక్తిని ప్రేమిస్తున్నామా అనే రీతిలో ఆలోచింపజేసిన మిథాలీ రాజ్‌ గేమ్‌ ఛేంజర్‌' అని ట్వీట్‌ చేశారు.

16 ఏళ్ల వ‌య‌సులో అరంగేట్రం:

16 ఏళ్ల వ‌య‌సులో అరంగేట్రం:

16 ఏళ్ల వ‌య‌సులో 1999లో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేశారు. ఇక 19 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు సాధించారు. 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మిథాలీ రాజ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. వన్డేల్లో వ‌రుస‌గా ఏడు అర్ధ సెంచ‌రీలు చేసిన తొలి క్రికెట‌ర్‌గా రికార్డు సృష్టించారు.

వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు:

వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు:

అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మిథాలీ రాజ్ అనేక రికార్డులను సృష్టించారు. మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ చరిత్ర సృష్టించారు. మిథాలీ భారత్ తరఫున 10 టెస్టులు, 209 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 663, వన్డేలలో 6888, టీ20లలో 2364 పరుగులు చేశారు. మొత్తంగా 8 సెంచరీలు చేశారు.

పృథ్వీ షాకు ఎవరైనా సాయం చేయండి: ఇయాన్‌ బిషప్‌

Story first published: Thursday, January 28, 2021, 14:11 [IST]
Other articles published on Jan 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X