న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ పాండ్యా వర్కౌట్ వీడియో.. ఫిదా అయిన బాలీవుడ్ భామలు!!

Bollywood actress Karishma Tanna left stunned after watching Hardik Pandya’s hop push-ups

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఆటగాడు. శారీరక దృఢత్వంపై అతడికి ఎనలేని నమ్మకం. జట్టు సభ్యులంతా రెండు గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ నాలుగు గంటల వరకు కష్టపడతాడు. ఎక్కువ సేపు జిమ్‌లో గడుపుతూ భారత ఆటగాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడిని చూసి మిగతా భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. కోహ్లీని చూసి జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మనీష్ పాండే, మొహమ్మద్ షమీలు కూడా సిక్స్ పాక్ చేసారు.

పాండ్యా వర్కౌట్ వీడియో

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ సమయంలోనూ క్రికెటర్లు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఇంట్లోనే కష్టపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా జిమ్ చేసి కండలు పెంచాడు. ఆదివారం తాను వర్కౌట్ చేస్తున్న వీడియోను హార్దిక్ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. కండలు తిరిగిన శరీరంతో పాండ్యా కఠినమైన వ్యాయామాన్ని సునాయాసంగా చేశాడు. పుష్ అప్స్ చేయడమే కాకుండా.. ఒకచోటు నుండి మరోచోటుకి వెళుతూ చేయడం ఇక్కడ విశేషం. వీడియో చూస్తే పాండ్యా ఫిట్‌నెస్‌ లెవెల్స్ ఏవిధంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది.

ఇది బీభత్సం పాండ్యా

ఇది బీభత్సం పాండ్యా

హార్దిక్ పాండ్యా తాను చేయడమే కాకుండా తన సోదరుడు కృనాల్ పాండ్యకు సవాల్ చేశాడు. 'స్ట్రాంగర్. ఫిట్టర్. ఇంకా నిర్మాణంలోనే ఉంది భాయ్. ఇంత కంటే బాగా వర్కౌట్ చేయాలని చాలెంజ్ చేస్తున్నా. భాయ్.. మీరు ఎన్ని చేయగలరో చూద్దామా' అని హార్దిక్ ఇన్​స్టాగ్రామ్ పోస్టుకు కాప్షన్ రాసుకొచ్చాడు. పాండ్యా వర్కౌట్ వీడియో చూసిన బాలీవుడ్ హీరోయిన్స్ సయామీ ఖేర్​, కరిష్మా తనా ఫిదా అయ్యారు. 'ఇది బీభత్సం పాండ్యా' అని సయామి కామెంట్ చేయగా.. 'ఇది ఎలా చేశావు?. వావ్​' అని కరిష్మా కామెంట్ చేసారు. అయితే హార్దిక్ సతీమణి నటాషా స్టాంకోవిచ్.. వారికి​ ఎమోజీలను పోస్ట్ చేసారు.

వెన్నుగాయంతో దూరం:

వెన్నుగాయంతో దూరం:

గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌ పాండ్యా .. శస్త్ర చికిత్స తర్వాత గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ 'ఎ' పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా చివరి నిమిషంలో హార్దిక్‌ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. పాండ్యా కోసం బీసీసీఐ కొన్ని రోజులు జట్టు ఎంపికను కూడా వాయిదా వేసింది. ఆపై దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. అది కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా జరగలేదు. అయితే ప్రొటీస్ సిరీస్ ముందు హార్దిక్‌ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే క్రమంలో రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్‌ టీ20 కప్‌లో రిలయన్స్‌-1 తరఫున ఆడిన హార్దిక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఫిట్‌నెస్‌ క్రెడిట్‌ శంకర్‌ బసూదే:

ఫిట్‌నెస్‌ క్రెడిట్‌ శంకర్‌ బసూదే:

భారత క్రికెట్‌ జట్టును ఫిట్‌నెస్‌ పరంగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత శంకర్‌ బసూదే. కోహ్లీ, బుమ్రా, పాండ్యా, జడేజా వంటి క్రికెటర్లను ఫిట్‌నెస్‌ పరంగా కూడా టాప్‌లో నిలిపిన వ్యక్తి శంకర్‌ బసూ. గతేడాది వన్డే ప్రపంచకప్‌‌లో భారత జట్టు సెమీస్‌లో తన పోరాటాన్ని ముగించిన తర్వాత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శంకర్‌ బసూ తప్పుకున్నాడు. తన కాంట్రాక్ట్‌ గడువు ముగిసిపోవడంతో శంకర్‌ బసూ మళ్లీ అందుకు మొగ్గుచూపలేదు.

'కనీసం ఒక్క సెంచరీ అయినా కొట్టాల్సిందే.. లేదంటే క్రికెట్ ఆడి వేస్ట్‌'

Story first published: Monday, June 22, 2020, 14:00 [IST]
Other articles published on Jun 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X