'కనీసం ఒక్క సెంచరీ అయినా కొట్టాల్సిందే.. లేదంటే క్రికెట్ ఆడి వేస్ట్'

సౌతాంప్టన్: త్వరలో ఇంగ్లండ్ గడపై ప్రారంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్‌లో కనీసం ఒక్క సెంచరీ అయినా కొట్టాల్సిందేనని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సెంచరీ చేయకుంటే క్రికెట్ ఆడి వేస్ట్ అని ఛేజ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లీష్ జట్టుపై వారి దేశంలో సెంచరీ చేయాలని తాను ఎప్పుడూ కోరుకుంటానన్నాడు. ఒక ఉన్నతస్థాయి బ్యాట్స్‌మన్‌గా ఎదగడానికి ఇంగ్లండ్‌తో సిరీస్‌ను ఉపయోగించుకోవాలని ఛేజ్ చూస్తున్నాడు.

సెంచరీ చేయకపోతే:
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోస్టన్ ఛేజ్ మాట్లాడుతూ... 'ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేయడమంటే అది కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకుని కనీసం సెంచరీ కొట్టడంపై దృష్టి పెట్టా. ఒకవేళ సెంచరీ చేయకపోతే మాత్రం అది నాలో తీవ్ర నిరాశనే మిగులుస్తుంది. ఇంగ్లండ్‌లో ఒక్క సెంచరీ చేస్తే చాలు. ఇక్కడ శతకం సాధిస్తే.. ఆల్‌రౌండర్‌గా నాకు మరింత రుజువు చేసుకునే అవకాశం లభిస్తుంది. దాంతో పాటు బ్యాట్స్‌మన్‌గా నా రేటింగ్ కూడా పెరుగుతుంది' అని అన్నాడు.

బ్యాట్‌తో మెరవాలనుకుంటున్నా:
'వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఒక మంచి సిరీస్ జరుగుతుందనుకుంటున్నా. ఆ సిరీస్‌లో నేను బ్యాట్‌తో మెరవాలని కోరుకుంటున్నా. సాధ్యమైనన్ని పరుగులు సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం మా టాపార్డర్ అంత బాలేదు. మా జట్టులోని సభ్యులు 30, అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడటంతో వారి అనుభవం పనికొస్తుంది. మేము ఎప్పుడూ మెరుగుపడటంపైనే ఎక్కువగా దృష్టి పెడుతాం' అని రోస్టన్ ఛేజ్ చెప్పాడు. ఛేజ్ ఇప్పటివరకూ 32 టెస్టులు ఆడి ఐదు సెంచరీలతో 1,695 పరుగులు చేసాడు.

ఆర్చర్‌తో పోటీ పడాలి:
'ఈ సిరీస్‌లో కరీబియన్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్‌తో పోటీ పడాలని విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నా. జోఫ్రా నాకు ముందు తెలుసు. బార్బడోస్‌లోని లీగ్‌లో అతనితో ఆడాను. అప్పడు అతను చాలా చిన్నవాడు, బార్బడోస్ పాఠశాల జట్టు కోసం ఆడుతున్నాడు. జోఫ్రా ఎప్పుడూ మంచి ప్రతిభ కనబరిచేవాడు. అయితే అప్పట్లో అంత వేగంగా బంతులేసేవాడు కాదు. అప్పడు కూడా వేగంగా బౌలింగ్ చేసేవాడు కానీ ఇప్పుడు ఉన్నంత వేగంగా వేసేవాడు కాదు' అని ఛేజ్ తెలిపాడు.

సౌతాంప్టాన్‌లో తొలి టెస్టు:
గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా జూలై 8వ తేదీ నుంచి ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య సౌతాంప్టాన్‌లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగనుంది. కరోనా మహమ్మారి కారణంగా క్రీడాలోకం మూడు నెలలుగా స్తంభించిపోగా.. ఈ టెస్ట్ ద్వారా క్రికెట్ ఆట మొదలుకానుంది.
సానియాను కలిసేందుకు షోయాబ్‌కు అనుమతి.. నెల రోజులు హైదరాబాద్‌లోనే!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications