న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‌కు గట్టి షాక్.. గాయంతో ఆ స్టార్ పేసర్ దూరం!

Big blow for Pakistan as Shaheen Afridi likely to miss England, New Zealand series after knee injury

కరాచీ: టీ20 ప్రపంచకప్ 2022 ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో గాయపడిన ఆ జట్టు స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది సుదీర్ఘ కాలం పాటు జట్టుకు దూరం కానున్నాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ క్యాచ్ అందుకునే క్రమంలో షాహిన్ అఫ్రిది గాయపడ్డాడు. గతంలో అయిన మొకాలి గాయానికే మళ్లీ గాయమవడంతో షాహిన్ నొప్పితో విలవిలలాడాడు. ఈ మెగా టోర్నీకి ముందే అతన మొకాలి లింగ్మెట్‌కు సర్జరీ జరిగింది.

శ్రీలంక పర్యటనలో..

శ్రీలంక పర్యటనలో..

శ్రీలంక గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఫీల్డింగ్ చేస్తూ షాహిన్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లి చికిత్స తీసుకున్న అతను రిహాబిలిటేషన్‌లో ఉండగానే జట్టుతోనే నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లాడు. తుది జట్టులో లేకున్నా.. మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. ఆసియాకప్ ఆడకపోయినా.. జట్టుతోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే పూర్తిగా కోలుకోకముందే పాకిస్థాన్.. ప్రపంచకప్ కోసం అతన్ని తీసుకొచ్చిందనే విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా ఆ జట్టు మాజీ క్రికెటర్లు షాహిన్ అఫ్రిది విషయంలో పీసీబీపై విమర్శలు గుప్పించారు.

తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా..

తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా..

ప్రపంచకప్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో అంతగా ప్రభావం చూపని షాహిన్ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో దుమ్మురేపాడు. బంగ్లాదేశ్‌తో(4/22) నాలుగు వికెట్లు, సౌతాఫ్రికాతో (3/14) మూడు వికెట్లు, న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో(3/21) మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లోనూ ఆ జట్టు బ్యాటర్లను వణికించాడు.2.1 ఓవర్లు మాత్రమే వేసి కీలక అలెక్స్ హేల్స్ వికెట్ తీసాడు. కానీ కీలక సమయంలో అతను గాయపడటం పాకిస్థాన్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను 3 నుంచి 6 నెలలు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. మొకాలికి శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. షాహిన్ షా అఫ్రిది లేకపోవడం పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బే.

 ఆ రెండు సిరీస్‌లకు దూరం..

ఆ రెండు సిరీస్‌లకు దూరం..

అయితే షాహిన్ షా అఫ్రిది గాయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సొంతగడ్డపై డిసెంబర్, జనవరిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లకు అతను అందుబాటులో ఉండడని పీసీబీ వర్గాలు పేర్కొన్నట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఫో తెలిపింది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు షాహిన్ అఫ్రిది సిద్దం చేసేందుకు పీసీబీ అతనికి కావాల్సిన రెస్ట్ ఇవ్వనుంది. అతని గైర్హాజరీలో హారీస్ రౌఫ్ జట్టు బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు.

Story first published: Monday, November 14, 2022, 18:18 [IST]
Other articles published on Nov 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X