న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాంచెస్టర్‌ టెస్ట్.. ఓపెనర్‌గా బెన్ స్టోక్స్ సరికొత్త రికార్డు!!

Ben Stokes sets new England record after 36-ball fifty vs West Indies in Manchester Test

మాంచెస్టర్‌: తొలి టెస్టులో ఖంగుతిన్న ఆతిథ్య ఇంగ్లండ్‌.. విండీస్‌పై కసితీరా ప్రతీకారం తీర్చుకుంటూ రెండో టెస్టులో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. వరుణుడు ఒక రోజు తుడిచిపెట్టినా.. ఫలితాన్ని తమకు అనుకూలంగా రాబట్టుకుంది. మాంచెస్టర్‌లో సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు విండీస్‌కు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లండ్‌.. 198 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఇంగ్లండ్ విజయంలో బెన్ స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్ కీలక పాత్ర పోషించారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన బెన్‌ స్టోక్స్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

 ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ:

ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ:

మ్యాచ్‌ విజయంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ బెన్ ‌స్టోక్స్‌ అద్భుత పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కీలక వికెట్లు కోల్పోయిన దశలో 255 బంతుల్లో సెంచరీ బాదాడు. మొత్తంగా 356 బంతుల్లో 176 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్టకాలంలో ఉన్న జట్టును ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి 36 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ 57 బంతుల్లో 78 స్కోర్‌ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులోనాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.

నలుగురు ఓపెనర్లు:

నలుగురు ఓపెనర్లు:

మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు యాజమాన్యం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. టెస్టులో ఇంగ్లండ్‌కి నలుగురు బ్యాట్స్‌మెన్‌లు ఓపెనర్లుగా ఆడారు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ ఏకంగా నలుగురు ఓపెనర్లను మార్చడం 1921 తర్వాత ఇదే తొలిసారి. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లుగా రోరీ బర్న్స్ (15), డొమినిక్ సిబ్లే (120) ఆడారు. ఈ జోడీ ఆశించిన మేర రాణించలేకపోయింది. బర్న్స్ ఆరంభంలోనే వికెట్ చేజార్చుకోగా.. సిబ్లే మరీ నెమ్మదైన ఇన్నింగ్స్‌ ఆడాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆ ఇద్దరినీ పక్కన పెట్టిన ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్.. బెన్‌ స్టోక్స్ (78 నాటౌట్, జోస్ బట్లర్ (0)లను ఓపెనర్లుగా పంపింది. బట్లర్ ఫెయిలవగా.. స్టోక్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 1921లో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లో తొలిసారి ఇంగ్లండ్ సొంతగడ్డపై నలుగురు ఓపెనర్లని ఒకే మ్యాచ్‌లో ఆడించింది. ఆ తర్వాత కూడా దాదాపు 8 సార్లు ఇంగ్లండ్ నలుగురు ఓపెనర్లని ఒకే మ్యాచ్‌లో ఆడించింది. కానీ అవన్నీ విదేశీ గడ్డపైనే.

113 పరుగుల తేడాతో విజయం:

113 పరుగుల తేడాతో విజయం:

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ .. బెన్‌ స్టోక్స్ (176: 356 బంతుల్లో 17x4, 2x6), డొమినిక్ సిబ్లే (120: 372 బంతుల్లో 5x4) శతకాలు బాదడంతో మొదటి ఇన్నింగ్స్‌ని 469/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 287 పరుగులకి ఆలౌటవగా.. ఇంగ్లాండ్‌కి 182 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ‌స్టోక్స్ (78 నాటౌట్: 57 బంతుల్లో 4x4) మెరుపు ఇన్నింగ్స్ ఆడేశాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌ని 129/3తో డిక్లేర్‌ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 182 పరుగులు కలుపుకుని మొత్తం 312 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. లక్ష్య ఛేదనలో తడబడిన విండీస్ 198 పరుగులకే ఆలౌటైంది.

 విండీస్ జట్టుకి బోనస్:

విండీస్ జట్టుకి బోనస్:

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1 సమం చేసిన ఇంగ్లండ్‌ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రపోర్డ్‌ మైదానంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే.. సిరీస్‌ సమం అవుతుంది. మొదటి టెస్ట్ విండీస్ గెలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌లో బోణి కొట్టిన వెస్టిండీస్ జట్టులో మరింత ఉత్సాహం నింపే ఉద్దేశంతో క్రికెట్ వెస్టిండీస్ తాజాగా ఆటగాళ్లకు బోనస్ ప్రకటించింది. ఒకవేళ ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిస్తే.. విండీస్ జట్టుకి సుమారు రూ. 23 లక్షలు బోనస్‌గా ఇవ్వనున్నట్లు సీడబ్లూ‌ఐ ప్రకటించింది

టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం: క్రికెట్‌ ఆస్ట్రేలియా

Story first published: Tuesday, July 21, 2020, 15:21 [IST]
Other articles published on Jul 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X