న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా క్రికెటర్‌ వివాహేతర సంబంధం.. చెంపలు వాయించిన ప్రేయసి!

 BCCI set to drop Michael Clarke from commentary panel after fight with partner on street

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌కు చేధు అనుభవం ఎదురైంది. అతని ప్రేయసి అందరూ చూస్తుండగానే చెంపలు వాయించింది. తనను కాదని మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ..క్లార్క్ ప్రేయసి జేడ్ యాబ్రో అతనిపై విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో క్లార్క్‌.. జేడ్‌కు సర్ది చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆమె ఏమాత్రం కన్విన్స్‌ కాకపోగా, మరింత రెచ్చిపోయింది. పలానా రోజు నువ్వు ఆమెతో గడిపావంటూ క్లార్క్‌పై మాటల తూటాలతో దాడి చేసింది. తానే తప్పు చేయలేదని క్లార్క్‌ సంజాయిషీ ఇచ్చినా వినిపించుకోలేదు. ఆ మహిళతో చేసిన ఫోన్‌ చాట్‌ను బయటపెట్టాలని జేడ్‌ డిమాండ్‌ చేసింది. ఆ సమయంలో జేడ్‌ సోదరుడు, అతని భార్య అక్కడే ఉన్నారు.

క్లార్క్‌కు గతంలో కైలీ అనే మహిళతో వివాహమైంది. కానీ ఆమెతో విడిపోయిన అతను.. ప్రముఖ మోడల్ జేడ్‌తో సహజీవనం చేస్తున్నాడు. క్లార్క్ ఎక్కడికి వెళ్లినా ఆమెను వెంట తీసుకెళ్తాడు. ఇదిలా ఉండగా.. క్లార్క్ కొద్దికాలంగా జేడ్‌ను వదిలేసి పిప్ ఎడ్వర్డ్స్ అనే మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని ఆసీస్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఇద్దరూ శారీరకంగా కలిశారని ఆరోపిస్తూ జేడ్ తన ప్రియుడిపై కారాలు మిరియాలు నూరింది. 'నువ్వు ఆమెతో గడిపావు. డిసెంబర్ 17న నువ్వు ఆమెతో సెక్స్ చేశావ్.. నీకు నేను సరిపోనా..? నువ్వో మదమెక్కిన కుక్కవి..' అంటూ అతడి మీద విరుచుకుపడింది. ఈ ఘటన అనంతరం క్లార్క్ పార్క్‌లో జరిగినదానికి బహిరంగ క్షమాపణలు చెప్పాడు.

ఈ వివాదం నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కామెంట్రీ ప్యానెల్ నుంచి క్లార్క్‌ను తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో మరో కామెంటేటర్‌ను తీసుకునే ప్రయత్నాలు చేస్తుందని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ పేర్కొంది.

41 ఏళ్ల క్లార్క్‌.. ఆసీస్‌ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో అతను 28 సెంచరీలు, 27 హాఫ్‌ సెంచరీల సాయంతో 8643 పరగులు చేయగా.. వన్డేల్లో 8 సెంచరీలు, 58 హాఫ్‌ సెంచరీల సాయంతో 7981 పరుగులు చేశాడు. టీ20ల్లో హాఫ్‌ సెంచరీ సాయంతో 488 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో క్లార్క్‌ అత్యధిక స్కోర్‌ 329 నాటౌట్‌గా ఉంది.

Story first published: Friday, January 20, 2023, 20:54 [IST]
Other articles published on Jan 20, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X